సొరంగంలో కూరుకుపోయిన మృతదేహం గుర్తింపు

మనోరంజని ప్రతినిధి నాగర్ కర్నూల్ మార్చి 09 – టన్నెల్ ప్రమాద ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 16వ రోజు రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా సాగుతోంది. ఫిబ్రవరి 22న ప్రమాదం జరగ్గా.. అందులో 8 మంది చిక్కుకుపోయారు. టన్నెల్‌లో గల్లంతైన వారిని గుర్తించడంలో తాజాగా కొంత పురోగతి లభించింది. ప్రమాదం జరిగిన 100 మీటర్ల దూరంలో డి-2 పాయింట్‌లో మనుషుల ఆనవాళ్లను కేరళ కేడవర్ డాగ్స్ స్క్వాడ్ గుర్తించినట్లు తెలిసింది. TBM మెషీన్ ఎడమ పక్కన ఓ మృత దేహానికి సంబంధించిన చేయి కనిపించినట్లు తెలిసింది.GPR, కేడవర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశాలలో చిక్కుకున్న వారి ఆచూకీ కోసం ప్రస్తుతం తవ్వకాలు ముమ్మరం చేశారు. ఈ ప్రాంతంలో సిబ్బంది జాగ్రత్తగా మట్టిని తొలగి స్తున్నారు. మృతదేహం పూర్తిగా కాంక్రీట్‌లో కూరుకుపోయి ఉన్నట్లు తెలిసింది. డ్రిల్లింగ్ ద్వారానే శరీరాలను బయటికి తీసేందుకు సాధ్యమవు తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.నేడు రెస్క్యూ ఆపరేషన్‌లో 130 మంది నిపుణుల బృందాలు పాల్గొన్నాయి గల్లంతైన వారిలో కొందరిని నేడు సాయంత్రానికి గుర్తించే అవకాశం ఉంది. అయితే ఆనవాళ్లు లభించడాన్ని అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. మరి గంటల్లో పూర్తి స్థాయి సమాచారం రానుంది

  • Related Posts

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 17 :- నిర్మల్ జిల్లా భైంసా పట్టణ కేంద్రంలోని మాజీ కౌన్సిలర్ రాజేశ్వర్ ఇటీవల అనారోగ్య కారణంతో స్వర్గస్తులైనారు. విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు జి. విట్టల్ రెడ్డి కుటుంబ సభ్యులను…

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 17 :- ఆశావర్కర్లకు ఉద్యోగ భద్రతతో పాటు సమస్యలు పరిష్కరించాలని మండల కేంద్రమైన ముధోల్ లోని తహసిల్ కార్యాలయంలో తహసిల్దార్ శ్రీకాంత్ కు ఆశావర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం వినతిపత్రం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్