సొరంగంసొరంగంలో కూరుకుపోయిన మృతదేహం గుర్తింపులో కూరుకుపోయిన మృతదేహం గుర్తింపు
మనోరంజని ప్రతినిధి నాగర్ కర్నూల్ మార్చి 09 - టన్నెల్ ప్రమాద ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 16వ రోజు రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా సాగుతోంది. ఫిబ్రవరి 22న ప్రమాదం జరగ్గా.. అందులో 8 మంది చిక్కుకుపోయారు. టన్నెల్లో గల్లంతైన వారిని గుర్తించడంలో తాజాగా కొంత పురోగతి లభించింది. ప్రమాదం జరిగిన 100 మీటర్ల దూరంలో డి-2 పాయింట్లో మనుషుల ఆనవాళ్లను కేరళ కేడవర్ డాగ్స్ స్క్వాడ్ గుర్తించినట్లు తెలిసింది. TBM మెషీన్ ఎడమ పక్కన ఓ మృత దేహానికి సంబంధించిన చేయి కనిపించినట్లు తెలిసింది.GPR, కేడవర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశాలలో చిక్కుకున్న వారి ఆచూకీ కోసం ప్రస్తుతం తవ్వకాలు ముమ్మరం చేశారు. ఈ ప్రాంతంలో సిబ్బంది జాగ్రత్తగా మట్టిని తొలగి స్తున్నారు. మృతదేహం పూర్తిగా కాంక్రీట్లో కూరుకుపోయి ఉన్నట్లు తెలిసింది. డ్రిల్లింగ్ ద్వారానే శరీరాలను బయటికి తీసేందుకు సాధ్యమవు తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.నేడు రెస్క్యూ ఆపరేషన్లో 130 మంది నిపుణుల బృందాలు పాల్గొన్నాయి గల్లంతైన వారిలో కొందరిని నేడు సాయంత్రానికి గుర్తించే అవకాశం ఉంది. అయితే ఆనవాళ్లు లభించడాన్ని అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. మరి గంటల్లో పూర్తి స్థాయి సమాచారం రానుంది