బీసీలకు రాజ్యాధికారం వచ్చేదాకా ఊరుకోం !

Breaking ; బీసీలకు రాజ్యాధికారం వచ్చేదాకా ఊరుకోం !

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వాఖ్యలు

హైదరాబాద్ న్యూస్ డెస్క్ ;
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన షోకాజు నోటీసులు తీసుకున్న తాను బీసీలకు ఎందుకు రాజ్యాధికారం రాదో చూస్తానని కాంగ్రెస్ బహిష్కృత నేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ సంచలన వాఖ్యలు చేశారు. బుదవారం ఆయన సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎన్నికల పోలింగ్‌లో పాల్గొన్న బీసీవాదులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తనకు షోకాజు నోటీసులు పంపించేలా ప్రయత్నం చేసిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ సెటైర్లు వేశారు. సీఎం దగ్గర ప్రతి ఒక్కరూ బానిసలుగా పడి ఉండాలని రేవంత్ రెడ్డి కోరుకున్నారని.. కానీ, తీన్మార్ మల్లన్న విషయంలో అది సాధ్యం కాదని అన్నారు.

తనను పార్టీ నుంచి బహిష్కరించినంత మాత్రాన రాష్ట్రంలో బీసీల ఉద్యమం ఆగుతుందనే భ్రమ ఉంటే ప్రభుత్వ పెద్దలు ఆ భ్రమను తొలగించుకోవాలని హెచ్చరించారు. తాము వెనుకటి బీసీలం కాదని.. ఆధునీకరించుకుని, ఆలోచన మెరుగుపరుచుకుని వచ్చిన మలిదశ బీసీ ఉద్యమకారులమని వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో చేపట్టిన కులగణనలో తప్పులు దొర్లాయని.. సర్వే రిపోర్టు చిత్తు కాగితంతో సమానమని అన్నారు. బీసీలు, ప్రజలను మోసం చేసేందుకు చేపట్టిన సర్వే రిపోర్టు చిత్తు కాగితమనే తాను తగులబెట్టానని క్లారిటీ ఇచ్చారు. బీసీకు న్యాయం జరగాలని కోరి తగులబెట్టడం తప్పు అయితే.. ఆ తప్పును తాను వెయ్యి సార్లు చేస్తానని అన్నారు. దేశానికి ఆదర్శంగా నిలిచే కులగణన చేయబోతున్నాం, తమ జన్మలు సార్థకం అయ్యాయంటూ ప్రభుత్వ పెద్దలు డైలాగులు కొట్టారని.. సర్వేను తప్పుదోవ పట్టించారని తీన్మార్ మల్లన్న ఆరోపించారు. బీసీలకు నిజంగా న్యాయం చేయాలని ఉంటే.. సర్వే ప్రారంభమైన తొలిరోజే సీఎం ఆయన ఇంట్లో, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారి వారి ఇళ్లలో సర్వేలో పాల్గొని అందరికీ ఆదర్శంగా ఉండేలా చూపించే వాళ్లని కామెంట్ చేశారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వంలో అవేమి జరగలేదని ధ్వజమెత్తారు.

  • Related Posts

    స్వర్గీయ వీరనారి చాకలి ఐలమ్మ కుటుంబాన్ని పరామర్శించిన ఎన్ హెచ్ ఆర్ సి. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య

    స్వర్గీయ వీరనారి చాకలి ఐలమ్మ కుటుంబాన్ని పరామర్శించిన ఎన్ హెచ్ ఆర్ సి. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి గారి వ్యక్తిగత సహాయకులు విజేందర్ రెడ్డితో కలిసి చిట్యాల రామచంద్రంకు ఘన నివాళులు మనోరంజని ప్రతినిధి…

    రేపు తెలంగాణలో మద్యం దుకాణాలు బంద్

    రేపు తెలంగాణలో మద్యం దుకాణాలు బంద్ మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 13 – మద్యం ప్రియులకు బాధాకరమైన వార్త ఏమి టంటే? రంగుల హోలీ సందర్భంగా రేపు ఉదయం 6 గంటల నుంచి సాయం త్రం 6 గంటల వరకు మద్యం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    స్వర్గీయ వీరనారి చాకలి ఐలమ్మ కుటుంబాన్ని పరామర్శించిన ఎన్ హెచ్ ఆర్ సి. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య

    స్వర్గీయ వీరనారి చాకలి ఐలమ్మ కుటుంబాన్ని పరామర్శించిన ఎన్ హెచ్ ఆర్ సి. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య

    రేపు తెలంగాణలో మద్యం దుకాణాలు బంద్

    రేపు తెలంగాణలో మద్యం దుకాణాలు బంద్

    జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్‌పై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆగ్రహం

    జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్‌పై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆగ్రహం

    ఎదుటివారికి ఇబ్బంది కలిగించవద్దు, మహిళల పట్ల మర్యాదగా ఉండాలి.

    ఎదుటివారికి ఇబ్బంది కలిగించవద్దు, మహిళల పట్ల మర్యాదగా ఉండాలి.

    ధర్మబధ్ధంగా జీవితం గడపాలనే ఉద్దేశ్యంతో కామ దహనం

    ధర్మబధ్ధంగా జీవితం గడపాలనే ఉద్దేశ్యంతో కామ దహనం

    సీపీని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ జడ్పి చైర్మన్

    సీపీని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ జడ్పి చైర్మన్