ఆదిలాబాద్: లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్

ఆదిలాబాద్: లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్

మనోరంజని ప్రతినిధి ఆదిలాబాద్ మార్చి 11 :- ఆదిలాబాద్ జిల్లాలో అక్రమాలకు పాల్పడుతున్న ప్రభుత్వ అధికారులను పట్టుకోవడంలో తెలంగాణ అనిశా (ACB) మరోసారి సక్సెస్ అయింది. మైనారిటీ బాలికల గురుకుల పాఠశాల భవనం నిర్మాణానికి సంబంధించిన రూ. 2 కోట్ల బిల్లును మంజూరు చేసేందుకు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జిన్నంవర్ శంకర్ ఫిర్యాదుదారుడిని లంచం కోసం డిమాండ్ చేశాడు. మొదట రూ. 2 లక్షల లంచం కోరిన శంకర్, ఫిర్యాదుదారుడి అభ్యర్థన మేరకు దానిని రూ. 1 లక్షకు తగ్గించాడు. అనంతరం మొదటి విడతగా రూ. 50,000 లంచం తీసుకుంటుండగా తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడ్డాడు. ఈ ఘటనపై అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి పాల్పడినట్లు అనుమానం వచ్చినప్పుడల్లా “1064” నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని అధికారులు ప్రజలను కోరారు

  • Related Posts

    ఆశ వర్కర్స్‌పై అత్యాచార నిందితుడికి కఠిన శిక్ష విధించాలి – సీఐటీయూ

    ఆశ వర్కర్స్‌పై అత్యాచార నిందితుడికి కఠిన శిక్ష విధించాలి – సీఐటీయూ మనోరంజని ప్రతినిధి మల్కాజిగిరి మార్చి :- 13 మల్కాజిగిరి మండల కమిటీ ఆశ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో ఆశ వర్కర్‌పై జరిగిన అత్యాచారం పై న్యాయం చేయాలని…

    ప్రశాంత వాతావరణంలో హోలీ జరుపుకోవాలి.ఎస్పీ జానకి షర్మిల.

    ప్రశాంత వాతావరణంలో హోలీ జరుపుకోవాలి.ఎస్పీ జానకి షర్మిల. మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 13 :- నిర్మల్ జిల్లా : ప్రశాంత వాతావరణంలో హోలీ పండుగ జర్రుపుకోవకని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు గురువారం వారి కార్యాలయం నుండి ప్రకటన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఆశ వర్కర్స్‌పై అత్యాచార నిందితుడికి కఠిన శిక్ష విధించాలి – సీఐటీయూ

    ఆశ వర్కర్స్‌పై అత్యాచార నిందితుడికి కఠిన శిక్ష విధించాలి – సీఐటీయూ

    ప్రశాంత వాతావరణంలో హోలీ జరుపుకోవాలి.ఎస్పీ జానకి షర్మిల.

    ప్రశాంత వాతావరణంలో హోలీ జరుపుకోవాలి.ఎస్పీ జానకి షర్మిల.

    సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన డీఎంకే నేతలు.. కారణమిదేనా..

    సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన డీఎంకే నేతలు.. కారణమిదేనా..

    రేపు జనసేన ఆవిర్భావ సభ ప్రారంభం

    రేపు జనసేన ఆవిర్భావ సభ ప్రారంభం