కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న సస్పెండ్

తెలంగాణలో రాజకీయ వేడెక్కుతోంది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. ఇటీవల జరిగిన బీసీ సభలో ఓ వర్గంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈ వ్యాఖ్యలు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు దారితీసినట్లు హైకమాండ్ భావించింది.ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ అధిష్ఠానం ఫిబ్రవరి 5న మల్లన్నకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆయన్ని ఫిబ్రవరి 12లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కానీ, మల్లన్న నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో, పార్టీ అత్యున్నత నాయకత్వం అతనిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. తీన్మార్ మల్లన్న భవిష్యత్ రాజకీయ ప్రస్థానం ఏ మార్గంలో సాగనుందో వేచి చూడాలి.

  • Related Posts

    నేడు స్టేషన్‌ఘన్‌పూర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి..!!

    నేడు స్టేషన్‌ఘన్‌పూర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి..!! .800 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం స్వయం సహాయక సంఘాలకు రూ.100 కోట్ల రుణాల పంపిణీ అనంతరం కృతజ్ఞత సభలో ప్రసంగించనున్న సీఎం ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా భారీగా ఏర్పాట్లు వరంగల్‌: ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఆదివారం…

    బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేస్తే రంగు పడుద్ది: సజ్జనార్

    బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేస్తే రంగు పడుద్ది: సజ్జనార్ మనోరంజని ప్రతినిధి మార్చి 16 – ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారికి TGSRTC ఎండీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగానే వైజాగ్ లోకల్ బాయ్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తమిళ భాషపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆసక్తికర వ్యాఖ్యలు

    తమిళ భాషపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆసక్తికర వ్యాఖ్యలు

    నేడు స్టేషన్‌ఘన్‌పూర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి..!!

    నేడు స్టేషన్‌ఘన్‌పూర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి..!!

    ఓటర్, ఆధార్ లింకింగ్‌పై 18న కీలక సమావేశం

    ఓటర్, ఆధార్ లింకింగ్‌పై 18న కీలక సమావేశం

    బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేస్తే రంగు పడుద్ది: సజ్జనార్

    బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేస్తే రంగు పడుద్ది: సజ్జనార్