తెలంగాణలో రాజకీయ వేడెక్కుతోంది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. ఇటీవల జరిగిన బీసీ సభలో ఓ వర్గంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈ వ్యాఖ్యలు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు దారితీసినట్లు హైకమాండ్ భావించింది.ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ అధిష్ఠానం ఫిబ్రవరి 5న మల్లన్నకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆయన్ని ఫిబ్రవరి 12లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కానీ, మల్లన్న నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో, పార్టీ అత్యున్నత నాయకత్వం అతనిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. తీన్మార్ మల్లన్న భవిష్యత్ రాజకీయ ప్రస్థానం ఏ మార్గంలో సాగనుందో వేచి చూడాలి.