Ugadi 2025: ఉగాది పచ్చడిలో ఆరు రుచులు.. ఆరు సంకేతాలకు సూచికం.

Ugadi 2025: ఉగాది పచ్చడిలో ఆరు రుచులు.. ఆరు సంకేతాలకు సూచికం.

ఉగాది పండుగ అంటే ముందుగా అందరికి గుర్తొచ్చేది.. ఉగాది పచ్చడి.. కొత్త సంవత్సరం రోజు షడ్రుచులతో తయారు చేసే ఉగాది పచ్చడి ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెపుతుంటారు. ఇందులో ఉండే ఆరు పదార్థాలు… ఆరు సంకేతాలను సూచిస్తాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. ఉగాది పచ్చడిని ఒక్కో చోట ఒక్కో విధంగా తయారు చేస్తుంటారు. కానీ, ఎక్కడి వాళ్లైన సరే.. అందులో తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అనే ఆరు రుచులను తప్పకుండా ఉండేలా చూస్తారు. ఈ పచ్చడి కోసం చెరకు, అరటి పళ్ళు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం, జీలకర్ర, మిరపకాయ వంటివి వాడుతుంటారు. ఇన్ని కలిపి చేసిన ఉగాది పచ్చడిని ఒక మహాఔషధమని అంటారు పెద్దలు. ఈ ఉగాది పచ్చడిని ఈ పండుగ నుంచి శ్రీరామనవమి వరకూ లేదా చైత్ర పౌర్ణమి వరకు ప్రతిరోజూ తింటే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, ఆ సంవత్సరమంతా రోగాలేవీ దరిచేరవనే నమ్మకం కూడా ఉంది. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఉగాది పచ్చడిని ‘నింబ కుసుమ భక్షణం’, ‘అశోకకళికా ప్రాశనం’ అంటారు. రుతువులలో వచ్చే మార్పుల వల్ల వచ్చే రోగాల నుంచి రక్షణగా, ఈ పచ్చడిని ఔషధంగా తీసుకోవడం పూర్వం నుంచే ఆనవాయితీగా వస్తోంది. ఉగాది పచ్చడిలో ఉండే వేప పువ్వు కడుపులో ఉన్న నులిపురుగులను చంపేస్తుంది. వేపగాలి ఆటలమ్మ, అమ్మోరు లాంటి అంటురోగాలను దగ్గరకి రానివ్వకుండా కాపాడుతుంది. మామిడి యాంటీ వైరల్ లక్షణాలు కలిగి ఉంది. మిరియాలు దగ్గు, జలుబు, పైత్యాలను అదుపులో ఉంచుతాయి. బెల్లం రక్తాన్ని శుద్ధి చేస్తుంది. చింతపండు మలబద్దకాన్ని, నీరసాన్ని తగ్గిస్తుంది. ఉప్పు ఎండాకాలంలో వచ్చే డీ హైడ్రేషన్ని తగ్గిస్తుంది. సంవత్సరం అంతా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సమానంగా తీసుకోవాలనే సందేశాన్ని కూడా ఉగాది పచ్చడి ఇస్తుంది.

1)..బెల్లం .. తీపి : సంతోషానికి

2)..ఉప్పు : జీవితంలో ఉత్సాహానికి

3)..వేప పువ్వు… చేదు: బాధ తాలూకు అనుభవాలకు

4)..చింతపండు… పులుపు : నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులకు,

5)..పచ్చి మామిడి ముక్కల.. పులుపు: కొత్త సవాళ్లకు,

6)..కారం సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులకు సంకేతం అని చెప్పుతారు.

  • Related Posts

    మహాత్మా జ్యోతిరావ్ ఫూలే జయంతి సందర్భంగా – ఓ సమానత్వ దీపస్తంభానికి కృతజ్ఞతాంజలి

    మహాత్మా జ్యోతిరావ్ ఫూలే జయంతి సందర్భంగా – ఓ సమానత్వ దీపస్తంభానికి కృతజ్ఞతాంజలి రచన: వాడేకర్ లక్ష్మణ్ భారతదేశపు సామాజిక చరిత్రలో కొన్ని నామాలు వెలుగుమొగ్గలుగా మెరుస్తూ ఉంటాయి. అటువంటి మహానుభావుల్లో ఒకరు మహాత్మా జ్యోతిరావ్ గోవిందరావ్ ఫూలే. ఆయన జీవితమంతా…

    పవన్ డిప్యూటీ సీఎం కావడం ఏపీ ప్రజల దురద్రుష్టం.. ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యాలు

    పవన్ డిప్యూటీ సీఎం కావడం ఏపీ ప్రజల దురద్రుష్టం.. ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యాలు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఓ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    నేటితో సంఘాల అంతర్గత ఆడిట్ సిఆర్పిల శిక్షణ ముగింపు.

    నేటితో సంఘాల అంతర్గత ఆడిట్ సిఆర్పిల శిక్షణ ముగింపు.

    3D మంత్రాలతో పేదల బతుకుల్ని నాశనం చేస్తున్న రేవంత్ సర్కార్: KTR

    3D మంత్రాలతో పేదల బతుకుల్ని నాశనం చేస్తున్న రేవంత్ సర్కార్: KTR

    సంజయ్ నగర్ పంచముఖి హనుమాన్ జన్మదినోత్సవానికి అందరూ ఆహ్వానితులే: ఆలయ కమిటీ

    సంజయ్ నగర్ పంచముఖి హనుమాన్ జన్మదినోత్సవానికి అందరూ ఆహ్వానితులే: ఆలయ కమిటీ

    కూతురు ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని తండ్రి ఆత్మహత్య

    కూతురు ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని తండ్రి ఆత్మహత్య