SLBC సొరంగం వద్దకు సీఎం రేవంత్ రెడ్డి!

SLBC సొరంగం వద్దకు సీఎం రేవంత్ రెడ్డి!

సహాయక చర్యలను సీఎంకు వివరించిన రెస్క్యూ టీమ్‌ అధికారులు

మనోరంజని ప్రతినిధి నాగర్ కర్నూల్ మార్చి02 ఎస్​ఎల్​బీసీ సొరంగం వద్ద కొనసాగుతున్న సహాయక పనులను మంత్రుల బృం దంతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం పరిశీలించారు. రక్షణ చర్యలకు సంబంధించి బృందాలను సీఎం ఆరా తీశారు. సహాయక చర్యలను సీఎంకు రెస్క్యూ టీమ్ అధికారులు వివరించారు. కాసేపు సొరంగ మార్గంలో పనులను పరిశీలించిన అనంతరం సీఎం రేవంత్‌ రెడ్డి బయటకు వచ్చి సంబంధిత అధికారులతో సమావేశం అయ్యారు. సొరంగంలో చేపట్టిన సహా యక చర్యలకు సంబంధిం చి సీఎం, మంత్రులకు వివరించారు. దేశవ్యాప్తంగా ఈ అంశం గురించి చర్చ :ఆపరేషన్‌లో ఇబ్బందులను సీఎం రేవంత్‌కు రెస్క్యూ టీమ్‌ వివరించారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలన్న సీఎం రేవం త్‌రెడ్డి తన అభిప్రాయాలు రెస్క్యూటీమ్‌తో పంచుకు న్నారు. సొరంగంలో గల్లంతైన కుటుంబాలకు అన్ని పార్టీలు అండగా ఉండాలి మనోధైర్యం కోల్పోలేదు మరింత పట్టుదలతో ప్రాజెక్టు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. టన్నెల్ పనుల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగకూడదనే ఉద్దేశంతో మనుషులు, మిషిన్లతోపాటు అవసర మైతే రోబోలను వినియోగిం చుకోవాలని అధికారులకు ఆదేశించమని సీఎం రేవంత్ రెడ్డి,తెలిపారు ప్రత్యామ్నాయ ప్రణాళికలు కూడా రూపొందించుకోవా లని, ప్రధాని మోదీ కూడా తరచూ సహాయ చర్యలపై ఆరా తీస్తున్నారని, తాను ప్రధానిని కలిసినప్పుడు ఆయన వివరాలు అడిగార ని,తెలిపారు. ఇంకా ఏదైనా సహాయం కావాలంటే ఉత్తమ్‌ను అడగాలని తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ అంశం గురించి చర్చించుకుంటు న్నారని అన్నారు. ఆప రేషన్‌కు సంబంధించి ప్రతి అంశాన్ని డాక్యుమెంట్‌గా మార్చాలని తెలిపారు. సమయం వృథా కాకుండా అన్ని చర్యలు తీసుకున్నా మని సీఎంకు అధికారులు తెలిపారు

  • Related Posts

    సంస్కార్ స్కూల్ డే-పోసిటివ్ పేరెంటింగ్ సెమినార్ విజయవంతం

    సంస్కార్ స్కూల్ డే-పోసిటివ్ పేరెంటింగ్ సెమినార్ విజయవంతం మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 15 :- భైంసా పట్టణంలోని బృందావన్ గార్డెన్స్‌లో సంస్కార్ స్కూల్ డే మరియు పోసిటివ్ పేరెంటింగ్ సెమినార్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముదోల్ ఎమ్మెల్యే పవార్…

    షాపూర్ క్షత్రియ పట్టుకరి సమాజ్ ఆధ్వర్యంలో ముంజు బంధంన్

    షాపూర్ క్షత్రియ పట్టుకరి సమాజ్ ఆధ్వర్యంలో ముంజు బంధంన్ మనోరంజని ప్రతినిధి ఆర్ముర్ మార్చి 15 ఏస్ ఎస్ కే క్షత్రియ సమాజ్ (పట్కరి) షాపూర్ నగర్ లో పిల్లలకు ఉపనయనం (ముంజు బంధంన్) కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీనికి షాపూర్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, LED, LCD టెలివిజన్ల ధరలు తగ్గే అవకాశం

    ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, LED, LCD టెలివిజన్ల ధరలు తగ్గే అవకాశం

    ఆ పథకానికి వయోపరిమితి 60 ఏళ్లకు తగ్గింపు!

    ఆ పథకానికి వయోపరిమితి 60 ఏళ్లకు తగ్గింపు!

    శ్రీశైలం దేవస్థానం పేరుతో నకిలీ వెబ్‌సైట్.. మోసపోయిన భక్తులు

    శ్రీశైలం దేవస్థానం పేరుతో నకిలీ వెబ్‌సైట్.. మోసపోయిన భక్తులు

    సంస్కార్ స్కూల్ డే-పోసిటివ్ పేరెంటింగ్ సెమినార్ విజయవంతం

    సంస్కార్ స్కూల్ డే-పోసిటివ్ పేరెంటింగ్ సెమినార్ విజయవంతం