Ramadan: రేపే రంజాన్‌..

Ramadan: రేపే రంజాన్‌..

నేడు పశ్చిమాసియా దేశాల్లో పండుగ

హైదరాబాద్‌, మార్చి 30: భారతదేశంలో రంజాన్‌ పండుగ (ఈదుల్‌ ఫితర్‌) సోమవారం జరగనుంది. శనివారం సాయంత్రం నెలవంక కనిపించడంతో సౌదీ అరేబియాతో పాటు పలు పశ్చిమాసియా దేశాల్లో ఆదివారం పండుగను జరుపుకుంటున్నారు.
దాంతో భారతదేశంలో సోమవారం పండుగను చేసుకోనున్నారు. ఈ నెల 2వ తేదీన రంజాన్‌ ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యాయి. దాంతో ఆదివారం రోజున చివరి ఉపవాసదీక్ష ఉండనుంది. ఇక రంజాన్‌ ఉపవాస దీక్షల సందర్భంగా హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా హలీం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఈ మాసంలో రూ.800 కోట్ల హలీమ్‌ విక్రయాలు జరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి.హైదరాబాద్‌లో ఒక్క పిస్తాహౌ్‌సలోనే ప్రతిరోజు 2 వేల కిలోల హలీమ్‌ను విక్రయిస్తుండగా, మదీనాలోని షాదాబ్‌, మాసాబ్‌ట్యాంక్‌లోని 555, మెహదీపట్నం, బంజారాహిల్స్‌లోని సర్వి, పాతబస్తీ, టోలిచౌకి, లక్డీకాపూల్‌, గచ్చిబౌలీ ప్రాంతాల్లోని షాగౌస్‌, మెహ్‌ఫిల్‌ వంటి రెస్టారెంట్లు సగటున రోజుకి 1000 నుంచి 1500 కిలోల దాకా హాలీమ్‌ అమ్ముతున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లో ఏప్రిల్‌ 6వ తేదీ దాకా హాలీం విక్రయాలు జరగనున్నాయి. రంజాన్‌ మాసం ముగిసిన తర్వాత షవ్వాల్‌ మాసం ప్రారంభం కానుంది. ఆ మాసం ప్రారంభంలో ఆరు రోజుల పాటు చాలా మంది ఉపవాస దీక్షలు చేస్తారు. దాంతో వారి కోసం ఆరురోజుల పాటు ప్రత్యేకంగా హాలీం తయారుకానుంది

  • Related Posts

    తెలంగాణ మాజీ గవర్నర్ తమిళ్ సై కి పితృవియోగం

    తెలంగాణ మాజీ గవర్నర్ తమిళ్ సై కి పితృవియోగం మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:ఏప్రిల్ 09తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్ తండ్రి, తమిళనాడు కాంగ్రెస్ మాజీ చీఫ్ కుమార్ అనంతన్ (93) ఈరోజు తెల్లవారు జామున చెన్నైలో…

    Waqf Amendment Act: అమల్లోకి వచ్చిన వక్ఫ్ చట్టం.. ప్రభుత్వ నోటిఫికేషన్ విడుదల..!!

    Waqf Amendment Act: అమల్లోకి వచ్చిన వక్ఫ్ చట్టం.. ప్రభుత్వ నోటిఫికేషన్ విడుదల..!! న్యూఢిల్లీ: పార్లమెంటులో గత వారం ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ చట్టం ఈరోజు (ఏప్రిల్ 8) నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారంనాడు ఒక…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    జాతీయ స్థాయి యోగాలో సత్తాచాటిన రబింద్ర విద్యార్థులు

    జాతీయ స్థాయి యోగాలో సత్తాచాటిన రబింద్ర విద్యార్థులు

    భైంసా ముద్దుబిడ్డ…సాయికుమార్ పటేల్ విజయగాథ

    భైంసా ముద్దుబిడ్డ…సాయికుమార్ పటేల్ విజయగాథ

    అధైర్యపడొద్దు..అండగా నేనున్నా

    అధైర్యపడొద్దు..అండగా నేనున్నా

    గ్రామాల్లో ఘనంగా అంబలి బార్సి పండుగ

    గ్రామాల్లో ఘనంగా అంబలి బార్సి పండుగ