

HYD: ఈనెల 11న బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఈ నెల 11న బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం తెలంగాణ భవన్లో జరగనుంది. ఈ మేరకు బీఆర్ఎస్ కార్యాలయం ప్రకటన విడుదల చేశారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ నాయకత్వంలో ఈ సమావేశం జరగనుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశా నిర్దేశం చేయనున్నారు.