Harish Rao | చిన్న ఉద్యోగం అని చులకన భావనతో చూడొద్దు : హరీశ్‌రావు..!!

Harish Rao | చిన్న ఉద్యోగం అని చులకన భావనతో చూడొద్దు : హరీశ్‌రావు..!!

Harish Rao: సిద్దిపేట, చిన్న ఉద్యోగం అని చులకన భావంతో చూడవద్దు, ఇంటిని వీడి అడుగు బయట పెట్టండి అని మహిళలను ఉద్దేశించి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. నీవు నీ కాళ్ళమీద నిలబడ్డప్పుడు మాత్రమే ప్రశ్నించగల్గుతావ్, బ్రతకగలుగుతావ్ అని హరీశ్‌రావు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి కళానిలయంలో మహిళా జాబ్ మేళాను హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ జాబ్ మేళాకు వివిధ ప్రాంతాల నుండి వందలాది మహిళలు తరలివచ్చారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. జీవితంలో ఎవరైనా మొదటి అడుగుతోనే ప్రారంభిస్తారు. ఎన్నో విజయగాథలు చూసి, అనుభవంతో చెబుతున్నాను. టాటా, బిర్లా వంటి పెద్ద పెద్ద బిలినీయర్లు చిన్నచిన్న జాబ్‌లతోనే జీవితం ప్రారంభించారు. చిన్న ఉద్యోగమైనా నీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది, ఇది మీకు జీవితంలో మొదటి అడుగు మాత్రమే. ఇందులో నాలుగు వేల ఉద్యోగాలు ఉన్నాయి.. అవి సిద్దిపేట పిల్లలకు రావాలనేది నా ఆలోచన. జాబ్ మేళ ద్వారా జీవితంలో ముందుకు సాగాలి అని హరీశ్‌రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని గొప్పలు చెప్పింది. గత ప్రభుత్వంలో నోటిఫికేషన్ వేసినవాటికి సర్టిఫికెట్స్ మాత్రమే ఇచ్చి మేమే ఇచ్చామని చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు భరోసా, రుణమాఫి, తులం బంగారం ఇస్తామని చెప్పి మోసం చేశారు. ఎనుములను నమ్మితే అన్ని ఎగావేతలే అని ప్రజలకు తెల్సిపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం లో 95 శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చాం. పేదరికం నుండి వచ్చిన సల్మా నేహా అనే మహిళ నాలుగు ఉద్యోగాలు సాధించింది. అడుగు ముందుకు వేయండి మీకు ఎం ఇబ్బంది ఉన్న నేను చూసుకుంటానని హరీశ్‌రావు భరోసానిచ్చారు

  • Related Posts

    షాద్ నగర్ బ్రాహ్మణ సేవ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

    షాద్ నగర్ బ్రాహ్మణ సేవ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ మనొరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 29 : షాద్‌నగర్ నియోజకవర్గ బ్రాహ్మణ సేవా సంఘం 2025 క్యాలెండర్‌ను జిల్లా బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు మంగు రాఘవరావు శనివారం ఆవిష్కరించారు. షాద్‌నగర్…

    శ్రీ విశ్వా వసు నామ సంవత్సరంలో విజయాలు సిద్దించాలి..

    శ్రీ విశ్వా వసు నామ సంవత్సరంలో విజయాలు సిద్దించాలి.. సిద్దిపేట : తెలుగు నూతన సంవత్సరం శ్రీ విశ్వా వసు నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు సిద్దిపేట జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బైకుపై మృతదేహంతో నిరసన.

    బైకుపై మృతదేహంతో నిరసన.

    షాద్ నగర్ బ్రాహ్మణ సేవ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

    షాద్ నగర్ బ్రాహ్మణ సేవ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

    సౌదీ అరేబియాలో శనివారం రాత్రి రంజాన్ నెలవంక దర్శనం.

    సౌదీ అరేబియాలో శనివారం రాత్రి రంజాన్ నెలవంక దర్శనం.

    తమిళ సినిమా ఇండస్ట్రీ సంచలన నిర్ణయం

    తమిళ సినిమా ఇండస్ట్రీ సంచలన నిర్ణయం