అవినీతి రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

ఎన్ హెచ్ ఆర్ సి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య పిలుపు

మనోరంజని ప్రతినిధి జగిత్యాల మార్చి 23 = జగిత్యాల జిల్లా స్థాయి సమావేశం గ్రాండ్ సక్సెస్
కొండగట్టు (జగిత్యాల జిల్లా): దేశంలో ప్రతి పౌరుడు తమ హక్కులను బాధ్యతలు తెలుసుకొని అవినీతి రహిత సమాజం కోసం కృషి చేయాలని జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా స్థాయి సమావేశం జిల్లా అధ్యక్షులు కాసారపు శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టులో ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ల భద్రయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు న్యాయవాది సుంకనపల్లి రాము, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఇమ్మడి ప్రణయ్, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు వడ్డిక అనిల్ రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మీడియా కన్వీనర్ రాచర్ల వేణు తదితరులు హాజరైన ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య మాట్లాడుతూ రోజురోజుకు అవినీతి రాజ్యమేలుతుందని, దేశ సంపద అవినీతి అక్రమార్కుల చేతిలో దుర్వినియోగం అవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బలమైన ప్రజా పోరాటాల ద్వారానే దేశాన్ని అవినీతిపరుల నుండి కాపాడుకోగలమని ఆయన అన్నారు. అవినీతి అక్రమార్కులను సమాజంలో దోషులుగా చూపించే కార్యచరణను జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) రూపొందించిందని ఆయన పేర్కొన్నారు. అవినీతి రహిత సమాజం కోసం తమ సంస్థ చేస్తున్న కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు, న్యాయవాది సుంకనపల్లి రాము మాట్లాడుతూ మానవ హక్కుల ఉల్లంఘనపై స్పందించడమే కాకుండా మంచిని పెంచడం మానవత్వాన్ని పంచడం వంటి కార్యక్రమాలతో పాటు భారత రాజ్యాంగ చట్టాలను అనుసరించి పెన్ను పేపర్ ను ఉపయోగించి దేశంలో మార్పు, చైతన్యం కోసం కృషి చేస్తున్నామని అన్నారు. ఈ ప్రయత్నంలో 14 రాష్ట్ర కమిటీలు మన రాష్ట్రంలో 33 జిల్లా కమిటీల నిర్మాణం పూర్తి చేశామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి జనార్దన్ రెడ్డి, జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి చేకూట శేఖర్ యాదవ్, జిల్లా అధికార ప్రతినిధి కోల రాజేశం గౌడ్, జిల్లా సంయుక్త కార్యదర్శి గణేష్, జగిత్యాల పట్టణ అధ్యక్షులు గుగ్గిళ్ళ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లాలోని పలు మండల కమిటీల ప్రతినిధులకు నియమక పత్రాలు అందించారు.
గొల్లపల్లి మండల కమిటీ
అధ్యక్షులుగా: దేవరకొండ శ్యాంసుందర్
ప్రధాన కార్యదర్శిగా: ఎండి నజీర్ పాషా
సంయుక్త కార్యదర్శిగా: సిరికొండ గణేష్
వెలగటూరు మండల అధ్యక్షులుగా: ధర్మాజీ ప్రమోద్

జగిత్యాల రూరల్ మండల అధ్యక్షులుగా: పాలకుర్తి రంజిత్
ప్రధాన కార్యదర్శిగా: ముద్దసాని అజయ్

మల్యాల మండల అధ్యక్షులుగా: సామల లక్ష్మీనారాయణ
ప్రధాన కార్యదర్శిగా: ఆడెపు భరత్ కుమార్
సారంగాపూర్ మండల కమిటీ
అధ్యక్షులుగా: న్యారబోయిన వంశీ
ఉపాధ్యక్షులుగా: తుపాకుల జితేందర్
ప్రధాన కార్యదర్శిగా: రాసమల్ల రాకేష్
సంయుక్త కార్యదర్శిగా: నలువాల సుమన్

కోరుట్ల మండల అధ్యక్షులుగా: మిట్టపల్లి గణేష్
కోరుట్ల పట్టణ అధ్యక్షులుగా: ఆదిపెళ్లి మహేష్ గౌడ్
కథలాపూర్ మండల కమిటీ
అధ్యక్షులుగా: గండి రాజేశం
ఉపాధ్యక్షులుగా: మల్యాల ప్రశాంత్
ప్రధాన కార్యదర్శిగా: బుర్ర మనోజ్ కుమార్
సంయుక్త కార్యదర్శిగా: మర్రిపెల్లి గణేష్
తదితరులకు నియామక పత్రాలు అందించి సంస్థ విధివిధానాలకు అనుగుణంగా కృషి చేయాలని పేద ప్రజల పక్షాన నిలబడాలని సూచించారు

  • Related Posts

    మోహ లడ్డు తయారు చేయండి. గిరిజన మహిళలకు ఉపాధి మార్కెట్ సౌకర్యం కల్పిస్తాము.

    మోహ లడ్డు తయారు చేయండి. గిరిజన మహిళలకు ఉపాధి మార్కెట్ సౌకర్యం కల్పిస్తాము. పీడి డిఆర్డిఓ రాథోడ్ రవీందర్.. మనోరంజని ప్రతినిధి ఆదిలాబాద్ మార్చి 27 :- ఆదిలాబాద్ జిల్లా మారుమూల మండలమైన నార్నూరు మండలంలోని ఖైరత్వాడ గ్రామంలోని గిరిజన మహిళా…

    ముధోల్ వారపు సంత వేలం రూ.లక్ష 82వేలు

    ముధోల్ వారపు సంత వేలం రూ.లక్ష 82వేలు మనోరంజని ప్రతినిధి ముధోల్.మార్చి 27 ;- నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్ వార సంత 2025-2026సంవత్సరానికి గాను గురువారం వారపు సంత వేలం పాట ను గ్రామపంచాయతీ ఈవో ఆన్వర్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బీసీల పైన జరుగుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల ద్వారా బీసీల ఉనికిని కోల్పోతున్నార

    బీసీల పైన జరుగుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల ద్వారా బీసీల ఉనికిని కోల్పోతున్నార

    మోహ లడ్డు తయారు చేయండి. గిరిజన మహిళలకు ఉపాధి మార్కెట్ సౌకర్యం కల్పిస్తాము.

    మోహ లడ్డు తయారు చేయండి. గిరిజన మహిళలకు ఉపాధి మార్కెట్ సౌకర్యం కల్పిస్తాము.

    డ్రగ్స్ కేసుల్లో No.1గా మారిన ‘అక్షరాస్యుల కేరళ’

    డ్రగ్స్ కేసుల్లో No.1గా మారిన ‘అక్షరాస్యుల కేరళ’

    మాజీ సర్పంచ్ల ముందస్తు అరెస్ట్

    మాజీ సర్పంచ్ల ముందస్తు అరెస్ట్