హోలీ సంబరాల్లో పాల్గొన్న ప్రముఖులు

హోలీ సంబరాల్లో పాల్గొన్న ప్రముఖులు

మనోరంజని ప్రతినిధి మార్చి 14 :- నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గం కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో శుక్రవారం హోలీ పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. హోలీ పండుగను పురస్కరించుకొని బైంసా పట్టణంలో ఎమ్మెల్యే రామారావు పటేల్ కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు జి విట్టల్ రెడ్డి, నారాయణరావు పటేల్, ప్రజా ట్రస్ట్ చైర్మన్ మోహన్ రావు పటేల్, భైంసా ఏఎంసీ చైర్మన్ ఆనందరావు పటేల్ సహితం వేడుకల్లో పాల్గొని సంబరాలు జరుపుకున్నారు. కార్యకర్తలు ప్రముఖులకు రంగులు చల్లి శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖులు మాట్లాడుతూ ప్రజలందరూ సుఖసంతోషాలతో పండుగలను జరుపుకోవాలని ఆకాంక్షించారు. పండుగలు ప్రజల్లో ఐక్యతను పెంపొందించేందుకు దోహదపడతాయన్నారు. ప్రముఖుల నివాసాలు కార్యకర్తలు- నాయకులతో సందడిగా మారాయి. మండల స్థాయిలో సైతం హోలీ పండుగ సందడి నెలకొంది. వివిధ పార్టీల నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు సంబరాల్లో పాల్గొన్నారు

  • Related Posts

    గ్రైనేట్స్ తవ్వకాలను ఆపాలని తహసిల్దార్ కు వినతి

    గ్రైనేట్స్ తవ్వకాలను ఆపాలని తహసిల్దార్ కు వినతి మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 17 :- నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్ లో జనావాసాలకు సమీపంలో ఉన్న గ్రానైట్స్ తవ్వకాలను ఆపాలని కోరుతూ జాతీయ మానవ హక్కుల నిర్మల్…

    పెద్ద బజార్‌లో అక్రమ టవర్ నిర్మాణంపై కాలనీవాసుల ఆగ్రహం

    పెద్ద బజార్‌లో అక్రమ టవర్ నిర్మాణంపై కాలనీవాసుల ఆగ్రహం మనోరంజని ప్రతినిధి నిజామాబాద్ మార్చి 17 :-నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని 50వ డివిజన్ పెద్ద బజార్ ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన టవర్‌పై కాలనీవాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    పెద్ద బజార్‌లో అక్రమ టవర్ నిర్మాణంపై కాలనీవాసుల ఆగ్రహం

    పెద్ద బజార్‌లో అక్రమ టవర్ నిర్మాణంపై కాలనీవాసుల ఆగ్రహం

    ఉపవాసం భగవంతుని అనుగ్రహం పొందేందుకు ఓ మార్గం : గ్రంధాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

    ఉపవాసం భగవంతుని అనుగ్రహం పొందేందుకు ఓ మార్గం : గ్రంధాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

    పౌరసరఫరాల శాఖ మేనేజర్ శాలువతో సన్మానించిన అబ్దుల్ అజీం..

    పౌరసరఫరాల శాఖ మేనేజర్ శాలువతో సన్మానించిన అబ్దుల్ అజీం..

    చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేరు?

    చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేరు?