హైదరాబాద్లో బంగారం ధర ఫస్ట్ టైం ఎంతకు పోయిందంటే..!!

హైదరాబాద్లో బంగారం ధర ఫస్ట్ టైం ఎంతకు పోయిందంటే..!!

హైదరాబాద్: బంగారం ధరలు ఇవాళ(మంగళవారం) 90 వేల మార్క్ను చేరుకున్నాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 440 రూపాయలు పెరిగి 90 వేలకు చేరింది. హైదరాబాద్లో సోమవారం 24 క్యారెట్ల బంగారం 89 వేల 560 రూపాయలు పలికింది. ఇవాళ మరో 440 రూపాయలు పెరగడంతో 90 వేల రౌండ్ ఫిగర్ను చేరింది. 22 క్యారెట్ల బంగారం కూడా 400 రూపాయలు పెరిగి 82 వేల 100 నుంచి 82 వేల 500 రూపాయలకు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధరలు 90 వేల 150 రూపాయలకు పెరిగింది. అమెరికాలో ట్రంప్ అధికారంలోకి వచ్చాక యూఎస్టారిఫ్లపై అనిశ్చితి కారణంగా నెలకొంది. దీంతో.. బంగారానికి డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. ఇక.. వెండి ధరల విషయానికొస్తే.. కిలో వెండి ధరపై మంగళవారం 11 వందలు పెరిగింది. దీంతో.. హైదరాబాద్లో కిలో వెండి ధర లక్షా 13 వేలకు చేరింది. ఇదిలా ఉండగా బంగారం ధరలు పెరగడానికి కారణాలు లేకపోలేదు. గ్లోబల్ఎకానమీలో ఒడిదుడుకుల కారణంగా సెంట్రల్బ్యాంకులు కూడా భారీగా బంగారం కొంటున్నాయి. దేశీయంగా పెళ్లిళ్ల సీజన్, పండుగల కోసం గోల్డ్ కొనుగోళ్లకు డిమాండ్ పెరడం, ఇన్ ఫ్లేషన్స్ పెరగడం వంటి కారణాలతో ధరలు పెరుగుతూ వస్తున్నాయి. పెట్టుబడిదారుల నుంచి డిమాండ్ అధికమవటంతో.. అంతర్జాతీయ కమోడిటీస్ మార్కెట్లో వీటి ధరలు మరింత ఎగబాకాయని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. పెరుగుతున్న క్రూడాయిల్, నిత్యావసర ధరలతో పాటు బంగారం ధరలు కూడా ప్రస్తుతం బాటలో ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చిత పరిస్థితులు ఎప్పుడూ బంగారానికి డిమాండ్ పెంచేస్తుంటాయి. బంగారం ధరలు ఈ రేంజ్ లో పెరుగుతుండటం వల్ల నగల వ్యాపారుల (గోల్డ్ జ్యువెలర్లు) ఆదాయం పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాల్యూమ్ పరంగా గ్రోత్ ఉండకపోయినప్పటికీ, గోల్డ్ ధరలు పెరగడంతో రెవెన్యూ వృద్ధి చెందే అవకాశం ఉంది. గోల్డ్ ధరలు భారీగా పెరగడం, కొత్త స్టోర్లను ఏర్పాటు చేస్తుండడంతో జ్యువెలరీ రిటైలర్ల వర్కింగ్ క్యాపిటల్ ఖర్చులు కూడా పెరగనున్నాయి. కాగా, దేశంలో బంగారు నగలు అమ్ముతున్నవారిలో ఆర్గనైజ్డ్ సెక్టార్ వాటా మూడో వంతు మాత్రమే ఉంది. మెజారిటీ వాటా అన్ ఆర్గనైజ్డ్ సెక్టార్లోనే ఉంది

  • Related Posts

    సురక్షితంగా భూమి పైకి చేరుకున్నసునీతా విలియమ్స్

    స్వాగతం సుస్వాగతం సునీతా విలియమ్స్ సురక్షితంగా భూమి పైకి చేరుకున్నసునీతా విలియమ్స్ మనోరంజని ప్రతినిధి హైదరాబాద్ :మార్చి 18: భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ మరో వ్యోమగామి, బూచ్ విల్మోర్ లు, పెట్టకేలకు భూమి పైకి చేరుకున్నారు దాదాపు 9…

    భువిపైకి సునీత.. చిరంజీవి ట్వీట్ !

    భువిపైకి సునీత.. చిరంజీవి ట్వీట్ ! మనోరంజని ప్రతినిధి మార్చి 19 – వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ క్షేమంగా భూమిపై ల్యాండ్ కావడంపై మెగాస్టార్ చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. 8 రోజుల్లో తిరిగొస్తామని వెళ్లి 286 రోజులకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ‘నేను ఇంటికి రాను.. నన్ను మర్చిపో’.. భర్తకు మెసేజ్ పెట్టి..

    ‘నేను ఇంటికి రాను.. నన్ను మర్చిపో’.. భర్తకు మెసేజ్ పెట్టి..

    భర్తను ముక్కలుగా నరికిన భార్య.. ఆపై

    భర్తను ముక్కలుగా నరికిన భార్య.. ఆపై

    మళ్లీ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ తిరిగొచ్చింది…!

    మళ్లీ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ తిరిగొచ్చింది…!

    రాష్ట్రంలో ఉపఎన్నికలు ⁉*

    రాష్ట్రంలో ఉపఎన్నికలు ⁉*