

మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ మార్చి 09 – నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం వంజర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గొనె లక్ష్మన్ ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే మాజీ మంత్రి అల్లొల్ల ఇంద్రకరణ్ రెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త అల్లొల్ల మురళీధర్ రెడ్డి, మాజీ ఎంపీపీ మహిపాల్ రెడ్డి, మాజీ నిర్మల్ మార్కెట్ కమిటీ శ్రీకాంత్ యాదవ్, దర్మజి రాజేందర్, నాయకులు పథని భూమేష్, పాకాల రామచందర్, నాలం శ్రీనివాస్, వాసవి స్కూల్ నవనీత్ రెడ్డి, మాజీ ఆత్మ డైరెక్టర్ మహేష్ యాదవ్ తదితరులు ఆసుపత్రికి చేరుకుని పరామర్శించారు. ఈ సందర్భంగా నాయకులు లక్ష్మన్ ఆరోగ్య వివరాలను వైద్యులతో మాట్లాడి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పలువురు గ్రామ ప్రజలు కూడా ఆసుపత్రికి చేరుకుని, ఆయన ఆరోగ్యం పై ఆరా తీశారు.