శాసనసభ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహణ

మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 02 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతిను రాష్ట్ర ప్రభుత్వం మార్చి 2న అధికారికంగా నిర్వహించింది. ఆదివారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జయంతి కార్యక్రమంలో డివైఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొని శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డివైఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, శ్రీపాదరావు రాజకీయ ప్రస్థానం సర్పంచ్‌గా ప్రారంభమై, ఎమ్మెల్యేగా, శాసనసభ స్పీకర్‌గా ఎదిగారని గుర్తుచేశారు. ప్రజల మధ్య మమేకమై, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన ప్రజానాయకుడిగా ఆయన నిలిచారని కొనియాడారు. శ్రీపాద రావు ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పర్యవేక్షకులు శివరాజ్, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    హోలీ సంబరాలతో అలరించిన ఆర్మూర్ పట్టణం

    మనోరంజని ప్రతినిధి ఆర్మూర్ మార్చి 15 – ఆర్మూర్ పట్టణంలో హోలీ పండుగను ప్రజలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం నుండే యువత భారీ సంఖ్యలో వీధుల్లోకి వచ్చి రంగులు చల్లుకుంటూ హుషారుగా సంబరాలు చేసుకున్నారు. మున్సిపల్ పరిధిలోని పెర్కిట్, మామిడిపల్లి,…

    కుంటాల మండలంలోని హోలీ సంబరాలు

    కుంటాల మండలంలోని హోలీ సంబరాలు మనోరంజని మార్చ్14: నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలోని అన్ని గ్రామాలలో హోళీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఒకరినొకరు రంగులు చల్లుకుంటూ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు అందరి జీవితాలు రంగుల మాయం కావాలని ఆకాంక్షించారు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం: ప్రజల హక్కుల పరిరక్షణకు ప్రత్యేక చట్టాలు

    ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం: ప్రజల హక్కుల పరిరక్షణకు ప్రత్యేక చట్టాలు

    హోలీ సంబరాలతో అలరించిన ఆర్మూర్ పట్టణం

    హోలీ సంబరాలతో అలరించిన ఆర్మూర్ పట్టణం

    హోలీ ముసుగులో గంజాయి విక్రయం.. వీడి అతి తెలివి మామూలుగా లేదుగా..

    హోలీ ముసుగులో గంజాయి విక్రయం.. వీడి అతి తెలివి మామూలుగా లేదుగా..