వైభవోపేతం పద్మావతి శ్రీనివాస కళ్యాణ మహోత్సవం

వైభవోపేతం పద్మావతి శ్రీనివాస కళ్యాణ మహోత్సవం

     వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్

తరలివచ్చిన అశేష భక్తజనం

మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 11 :- నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని లక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం పద్మావతి శ్రీనివాసుల కళ్యాణ మహోత్సవం వైభవపీతంగా జరిగింది. వేద పండితుల ఆధ్వర్యంలో చేపట్టిన కళ్యాణ ఘట్టం కమనీయంగా కొనసాగింది. ఉదయం వేళ మాడ వీధుల్లో స్వామివారిని, పద్మావతి అమ్మవారి ఉత్సవ విగ్రహాలను ఊరేగించి, భక్తులు పెళ్ళికొడుకు, పెళ్లికూతురు బంధువులుగా మారి వేడుకలనుb జరుపుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక కల్యాణ మండపం ఏర్పాటుచేసి కళ్యాణ ఘట్ట ప్రాముఖ్యతను వేద పండితులు వివరించారు. ఈ సందర్భంగా మహిళలు, చిన్నారులు, వేదపండితులు చేపట్టిన నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని పూజలు నిర్వహించారు. కమిటీ సభ్యులు ఎమ్మెల్యేని స్వాగతించి శాలువాతో సత్కరించారు. కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ అనంద్ రావ్ పటేల్, నాయకులు విలాస్ గాదేవార్, మాజీ మున్సిపల్ చైర్మన్ బి గంగాధర్ తో పాటు ఆలయ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు పలువురు పాల్గొన్నారు

  • Related Posts

    సాగు నీటి కోసం రోడ్డెక్కిన రైతన్నలు

    సాగు నీటి కోసం రోడ్డెక్కిన రైతన్నలు కనికరం లేని కాంగ్రెస్ సర్కారుపై కర్షకుడి కన్నెర్ర నీళ్లు ఇవ్వకుంటే కలెక్టరేట్ ను ముట్టడిస్తాం అని హెచ్చరిక రైతు ధర్నాకు మద్దతుగా బిఆర్ఎస్ ధర్నాకు బయలు దేరినా సుంకె రవిశంకర్ హౌస్ అరెస్టు చేసిన…

    విద్యా భారతి పాఠశాలలో ముందస్తు హోలీ సంబరాలు ఘనంగా నిర్వహణ

    మనోరంజని ప్రతినిధి కుబీర్ మార్చి 13 :- నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని పల్సి గ్రామంలో ఉన్న విద్యా భారతి పాఠశాలలో గురువారం ముందస్తు హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా హోలీ పండుగను జరుపుకున్నారు. విద్యార్థులు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    సాగు నీటి కోసం రోడ్డెక్కిన రైతన్నలు

    సాగు నీటి కోసం రోడ్డెక్కిన రైతన్నలు

    విద్యా భారతి పాఠశాలలో ముందస్తు హోలీ సంబరాలు ఘనంగా నిర్వహణ

    విద్యా భారతి పాఠశాలలో ముందస్తు హోలీ సంబరాలు ఘనంగా నిర్వహణ

    హోలీ పండుగ వేళ పోలీసుల ఆంక్షలు.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక..!!

    హోలీ పండుగ వేళ పోలీసుల ఆంక్షలు.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక..!!

    భార్యలు తాగుతున్నారని పోలీస్ స్టేషన్లో భర్తల ఫిర్యాదు!

    భార్యలు తాగుతున్నారని పోలీస్ స్టేషన్లో భర్తల ఫిర్యాదు!