వేసవిలో ఈ జ్యూస్ తాగారంటే..

వేసవిలో ఈ జ్యూస్ తాగారంటే..

మండుటెండలతో జనాలు అల్లడిపోతున్నారు. ఎండల నుంచి ఉపశమనం పొందడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే సహజసిద్ధంగా శరీరాన్ని చల్లగా ఉంచడంలో కీరదోసకు మించిన ఆప్షన్‌ మరొకటి లేదు. కీర ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి చాలా మేలు చేస్తాయి.. కీరదోస ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి చాలా మేలు చేస్తాయి. పొటాషియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉండటం వలన, అధిక రక్తపోటుతో బాధపడేవారికి ఇది మంచి ఎంపిక. వేసవిలో ప్రతిరోజూ కీరదోస జ్యూస్‌ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.. కీరదోస జ్యూస్‌ మంచి డీటాక్స్ డ్రింక్‌గా కూడా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ప్రతి ఉదయం ఈ కూరగాయల జ్యూస్ తాగడం వల్ల శరీరం నుంచి అవాంఛిత వ్యర్థాలను బయటకు పంపి శుభ్రపరచడంలో సహాయపడుతుంది. ఇది అనేక వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తుంది. ప్రతిరోజూ కీరదోస జ్యూస్ తాగడం వల్ల శరీరంలోని అదనపు కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. బరువు కూడా త్వరగా తగ్గుతుంది. బెల్లీ ఫ్యాట్ కూడా కరిగిపోతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఊబకాయం ఉన్నవారికి కీరదోస జ్యూస్‌ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి, దీన్ని ప్రతిరోజూ తినడం కూడా చాలా మంచిది. వేసవి రోజుల్లో కీరదోస జ్యూస్‌ తాగడం వల్ల వేడి అనుభూతిని తగ్గి, శరీరం చల్లబడుతుంది. ఇది వడదెబ్బ నుంచి రక్షిస్తుందని నిపుణులు అంటున్నారు. అలాగే దీనిలోని పొటాషియం అధిక రక్తపోటును తగ్గిస్తుంది. ఇది మన శరీరంలోని చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. అంతేకాకుండా ఇది గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. కీరదోసలో విటమిన్ K ఎక్కువగా ఉంటుంది. ఇది గాయాల నుంచి రక్తస్రావం కాకుండా వెంటనే రక్తం గడ్డకట్టడానికి సహాయపడుతుంది. దీనిలోని మెగ్నీషియం బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. నిద్రలేమి సమస్యను తగ్గిస్తుంది. ఇది శరీరానికి విశ్రాంతిని ఇవ్వడమే కాకుండా జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇది అజీర్ణం, గ్యాస్, మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది

  • Related Posts

    ఉచిత యోగ ధ్యాన శిబిరాన్ని ప్రారంభించిన ఎస్సై కె. శ్వేత.

    ఉచిత యోగ ధ్యాన శిబిరాన్ని ప్రారంభించిన ఎస్సై కె. శ్వేత. *మనోరంజని న్యూస్, మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి. మార్చి 24 ప్రపంచవ్యాప్తంగా 162 దేశాలలో శారీరక, మానసిక ఆరోగ్యానికి మరియు ఆంతరంగిక చైతన్యానికి ఉపయోగపడే యోగ ధ్యాన కార్యక్రమాలను…

    భైంసా యువకుడి మానవతా గుణం –అత్యవసర పరిస్థితిలో రక్తదానం

    మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 24 :- మానవతా దృక్పథంతో ముందుకు సాగుతూ అవసరమైన వారికి అండగా నిలుస్తున్న భైంసా నేతాజీ నగర్ యువకుడు సాయి కుమార్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. సోమవారం భైంసా పట్టణంలోని వెంకటేశ్వర హాస్పిటల్‌లో చికిత్స…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కెమెరాలే నిరసన ప్రకటిస్తే…

    కెమెరాలే నిరసన ప్రకటిస్తే…

    గుడి నిర్మాణానికి విరాళం ఇచ్చిన మాజీ సర్పంచ్.

    గుడి నిర్మాణానికి విరాళం ఇచ్చిన మాజీ సర్పంచ్.

    హక్కుల కోసం తెలంగాణ నుంచి ఉద్యమ పొలికేక

    హక్కుల కోసం తెలంగాణ నుంచి ఉద్యమ పొలికేక

    తెలంగాణ అప్పు ఎంతంటే?

    తెలంగాణ అప్పు ఎంతంటే?