

మనోరంజని ప్రతినిధి నిజామాబాద్ మార్చి ౦౩ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని నగరంలో నీటి ఎద్దడి సమస్యను నివారించేందుకు నగరపాలక సంస్థ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో నగరంలోని రెండవ జోన్ పరిధిలోని ఆర్య సమాజ్ ప్రాంతంలో నీటి లీకేజ్ పనులను మున్సిపల్ ఇంజనీర్ మురళీకృష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నగరపాలక సంస్థ కమిషనర్ ఆదేశాల మేరకు నగరంలో నీటి లీకేజ్ పనులను వేగంగా పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, నీటి సరఫరా సమర్థవంతంగా సాగేందుకు ఈ పనులు రెండు రోజుల్లో పూర్తవుతాయని పేర్కొన్నారు. ప్రజలు ఈ కార్యక్రమానికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ లీకేజ్ పనుల పర్యవేక్షణలో అసిస్టెంట్ ఇంజనీర్ ఇనాయత్ కరీం, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.