విద్యుత్ బకాయిలను విడుదల చేయాలని పొన్నం ప్రభాకర్ ను కోరిన ➖ కోలిపాక లక్ష్మణ్

విద్యుత్ బకాయిలను విడుదల చేయాలని పొన్నం ప్రభాకర్ ను కోరిన ➖ కోలిపాక లక్ష్మణ్

  ★ బిల్లులను చెల్లించాలని అధికారుల ఒత్తిడి అయోమయంలో వృత్తిదారులు - గోపి రజక 

    తెలంగాణ అసెంబ్లీలో 150 కోట్లు విద్యుత్ బిల్లుల గురించి గతంలో కేటాయించిన బడ్జెట్ ను తక్షణమే విద్యుత్ బకాయిల కోసం విడుదల చేసి వృత్తిదారులను ఆదుకోవాలని 17-3-2025 సోమవారం హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో బీసీ సంక్షేమ శాఖామంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారిని కలిసి మెమోరండం అందజేసిన తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలిపాక లక్ష్మణ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు సాంబరాజు కుమార్, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు శాగంటి వెంకటేష్, కాప్ర మండల అధ్యక్షులు పొలాస సాయికుమార్. ఈసందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలిపాక లక్ష్మణ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రజక వృత్తిదారులు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ బిల్లులు కట్టాలని విద్యుత్ అధికారులు ఒత్తిడి పెంచడంతో అయోమయంలో పడ్డారని కావున గతంలో కేటాయించిన బడ్జెట్ ను తక్షణమే విడుదల చేసి ఆదుకోవాలని కోరారు. బీసీ సంక్షేమ శాఖామంత్రి పొన్నం ప్రభాకర్ గారు గతంలో మాట్లాడుతూ గత ప్రభుత్వం ఇచ్చిన ఉచిత విద్యుత్ పథకాన్ని మా ప్రభుత్వం ఎలాంటి అవాంతరాలు లేకుండా కొనసాగిస్తామన్న విషయాన్ని కోలిపాక లక్ష్మణ్ బీసీ మినిస్టర్ గారికి గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం ప్రజా సంక్షేమ ప్రభుత్వం కావున రజక వృత్తిదారుల సంక్షేమం కోసం ప్రతి కుటుంబానికి 2 లక్షల రూ. ఎలాంటి బ్యాంక్ షరతులు లేకుండా ఇవ్వాలని కోరారు. బీసీ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు స్పందిస్తూ ఎవరైనా వృత్తిదారులను ఉచిత విద్యుత్ విషయంలో ఇబ్బంది పెడితే నా దృష్టికి తీసుకురావాలని అన్నారు. సానుకూలంగా స్పందించిన బీసీ మంత్రివర్యులకు రాష్ట్ర కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేశారు
  • Related Posts

    ప్రభుత్వ హాస్టళ్ళలో విద్యార్థినీల ప్రతిభను వెలికితీసేందుకే యువ ఉత్సవ్

    ప్రభుత్వ హాస్టళ్ళలో విద్యార్థినీల ప్రతిభను వెలికితీసేందుకే యువ ఉత్సవ్ ఆకట్టుకున్న సైన్స్ ఎగ్జిబిషన్, ఫోటో గ్యాలరీ, సాంస్క్రతిక కార్యక్రమాలు ప్రభుత్వ హాస్టళ్ళలో ఉంటూ విద్యనభ్యసిస్తున్న విద్యార్థినీ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు నెహ్రు యువ కేంద్రం ఆధ్వర్యంలోయువ ఉత్సవ్…

    ఒత్తిడిని అధిగమించి విజయాన్ని సాధించాలి

    ఒత్తిడిని అధిగమించి విజయాన్ని సాధించాలి నిర్మల్ జిల్లా భైంసా మండలం వనాల్పడ్ గ్రామం లో స్థానిక ప్రభుత్వ వానాల్పడ్ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆనందిత ఫౌండేషన్ చైర్మన్,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బీటెక్ ఫలితాలలో శ్రీ చైతన్య ప్రభంజనం

    బీటెక్ ఫలితాలలో శ్రీ చైతన్య ప్రభంజనం

    ప్రభుత్వ హాస్టళ్ళలో విద్యార్థినీల ప్రతిభను వెలికితీసేందుకే యువ ఉత్సవ్

    ప్రభుత్వ హాస్టళ్ళలో విద్యార్థినీల ప్రతిభను వెలికితీసేందుకే యువ ఉత్సవ్

    ఒత్తిడిని అధిగమించి విజయాన్ని సాధించాలి

    ఒత్తిడిని అధిగమించి విజయాన్ని సాధించాలి