

మనోరంజని ప్రతినిధి మంచిర్యాల మార్చి 10 – మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ ఉత్కూర్ 9వ వార్డులో జరిగిన విషాద ఘటన అందరిని కలిచివేసింది. కానిస్టేబుల్ సురేందర్ కుమారుడు, 10 నెలల రుద్రాయన్ ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు వాటర్ బాటిల్ మూత మింగాడు. మూత గొంతులో చిక్కుకుపోవడంతో ఊపిరాడక శిశువు అస్వస్థతకు గురయ్యాడు. పిల్లవాడిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. బాలుడి మరణ వార్తతో ఊరంతా శోకసంద్రంగా మారింది.