

రోడ్డు ప్రమాదం.. బాలుడు మృతి, ఐదుగురికి గాయాలు
మనోరంజని ప్రతినిధి నిజామాబాద్ మార్చి 16 :- నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైపాస్ రోడ్డుపై కారు అదుపుతప్పి బోల్తా పడింది. బోల్తా పడే క్రమంలో సైకిల్‌పై వెళ్తున్న బాలుడిని ఢీకొట్టింది. ఈ ఘటనలో బాలుడు మరణించాడు. అలాగే కారులో ఉన్న ఐదుగురికి తీవ్రగాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.