రామాలయంలో ఏప్రిల్ 4న శాస్త్రీయ నృత్య కళా పోటీలు

రామాలయంలో ఏప్రిల్ 4న శాస్త్రీయ నృత్య కళా పోటీలు

మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 29 :- నిర్మల్ జిల్లా ముధోల్ మండల అష్టా గ్రామంలో ఇటీవల శ్రీ రామాలయాన్ని నిర్మించారు. అందులో భాగంగా శ్రీరామనవమి సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి కాకుండా ఇతర జిల్లాల నుంచి నృత్య కళాకారులను తమ ప్రదర్శనలను ప్రదర్శించుటకు అష్టా శ్రీ రామాలయ కమిటీ ఆధ్వర్యంలో శాస్త్రీయ నృత్య పోటీలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 4 నుండి తమ పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా ఆలయ కమిటీ వారు ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 4 నుండి సాంస్కృత కార్యక్రమంలో భాగంగా ఆసక్తిగల కళాకారులను తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. వచ్చేనెల నాలుగో తేదీ నుండి సంస్కృతి కార్యక్రమాలు ఉండగా సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు సంస్కృతిక, క్లాసికల్ నృత్యలు, జానపద నృత్యాలు, సెమి క్లాసికల్, వెస్టిన్ జానపద నృత్యాలకు పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ పోటీల్లో పాల్గొనేవారు శ్రీ రామాలయ కమిటీ సభ్యులకు సంప్రదించాలన్నారు. పాటకు ఉండే నాలుగు నిమిషాల సమయంలో పూర్తిచేసి సమన్వయంతో సమయపాలన పాటించి, నృత్య పోటీల్లో పాల్గొనేవారు సంప్రదాయ దుస్తులను ధరించి ఎటువంటి ప్రమాదకర విన్యాసాలు చేయకుండా అందరికీ ఆకట్టుకునేలా నృత్యాలు ఉండాలని పేర్కొన్నారు. ప్రదర్శన కారులో ఎవరి దుస్తులు వారు తీసుకొని రావాలని కోరారు. కళాకారులకు భోజన సౌకర్యం ఉంటుందని, కళాకారుల నైపుణ్యతను బట్టి పారితోషక ఉంటుందని ఆలయ కమిటీ పేర్కొంది. పారితోషంతోపాటు ఉత్తమ ప్రదర్శన కనబరిచిన వారికి ప్రశంస పత్రంతో పాటు మంచి పారితోషకం ఉంటుందని, ముధోల్ మండలంలోని గ్రామాలు తరలిరావాలని, స్వామి వారి వద్ద జరిగే నృత్య కళాకారులు చేసే విన్యాసాలను తిలకించాలని శ్రీ రామాలయ కమిటీ చైర్మన్ సంతోష్ రెడ్డి, నిర్వాహకులు రావుల శ్రీనివాస్ పత్రిక ప్రకటనలో వారు తెలిపారు

  • Related Posts

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి పూజా హెగ్డే

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి పూజా హెగ్డే మనోరంజని ప్రతినిధి తిరుపతి జిల్లా : ఏప్రిల్ 04 :-తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి,వారిని టాలీవుడ్ స్టార్‌ నటి పూజా హెగ్డే ఈరోజు ఉదయం దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ…

    రాములవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే

    కామోల్ లో ప్రారంభమైన శ్రీరామనవమి ఉత్సవాలు మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 30 :- నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని కామోల్ గ్రామంలో సీతారామచంద్రస్వామి ఆలయంలో ఉగాది పర్వదిన వేళ శ్రీరామనవమి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆలయంలో తొమ్మిది రోజులపాటు ప్రత్యేక వేడుకలు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    వక్ఫ్ బిల్లు ఆమోదంపై మోడీ కీలక వ్యాఖ్యలు

    వక్ఫ్ బిల్లు ఆమోదంపై మోడీ కీలక వ్యాఖ్యలు

    బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారుడు యూనస్‌తో ప్రధాని మోదీ భేటీ

    బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారుడు యూనస్‌తో ప్రధాని మోదీ భేటీ

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి పూజా హెగ్డే

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి పూజా హెగ్డే

    శ్రీరామనవమి శోభా యాత్ర సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై…

    శ్రీరామనవమి శోభా యాత్ర సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై…