రాజ్యాంగ నిర్మాతకు అవమానం

రాజ్యాంగ నిర్మాతకు అవమానం

మనోరంజని ప్రతినిధి గోదావరి జిల్లా: మార్చి 23 – తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం దూబచర్ల గ్రామ శివారు గాంధీ నగర్ కాలనీలోని రహదారి పక్కన ఉన్న అంబేద్కర్ విగ్రహానికి గుత్తి తెలియని వ్యక్తులు చెప్పుల దండలు వేయడం ఉదృత తకు దారితీసింది, ఆదివారం ఉదయం విగ్రహానికి చెప్పుల దండ ఉండటం చూసి అంబేద్కర్ అభిమానులు, మాల మహానాడు సభ్యులు రిజర్వేషన్ పోరాట సమితి సభ్యులు ఆందోళనకు దిగారు. స్థానికులు మండలంలోని అంబేడ్కర్‌వాదులు, మాల మహానాడు నేతలకు సమాచారం తెలపడంతో వారు భారీ ఎత్తున తరలి వచ్చి రాస్తారోకో నిర్వహిం చారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్ప డ్డాయి. విషయం తెలుసు కున్న ఆదనపు ఎస్పీ సుబ్బారాజు, కొవ్వూ రు డీఎస్పీ దేవకుమార్‌ సిబ్బందితో హూటహూటిన చేరుకుని క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌ను రంగంలోకి దింపారు. గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు సంఘటనా స్థలానికి వచ్చి అంబేడ్కర్‌ను అవమాన పరిచిన దోషులను కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు. రాస్తారోకో చేస్తున్న వారితో కలిసి రోడ్డు పై కూర్చుని సంఘీభావం తెలిపారు. ఈ విషయంపై మాజీ హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ అంబేడ్కర్‌ విగ్రహాన్ని చెప్పుల దండతో అవమానపర్చారని, అక్కడ నూతన విగ్రహాం ఏర్పాటు చేసి పైన షెల్టర్‌ నిర్మించాల ని డిమాండ్‌ చేశారు. ప్రభు త్వం ఏర్పాటు చేయకపోతే తామే ఏర్పాటు చేస్తామ న్నారు. అనంతరం డీఎస్పీకి వినతి పత్రం అందించారు. గోపాల పురం జనసేన కన్వీనర్‌ దొడ్డిగర్ల సువర్ణరాజు మాట్లాడుతూ దోషులను కఠినంగా శిక్షించి శాంతి భద్రతలను కాపాడాలని కోరారు. డీఎస్పీ, సీసీఎస్‌ సీఐ అనుకూరి శ్రీనివాస్‌, దేవరపల్లి సీఐ బియస్‌ నాయక్‌, నల్లజర్ల సీఐ విజయశంఖర్‌ అంబేడ్క ర్‌వాదులతో చర్చలు జరిపి అంబేడ్కర్‌ విగ్రహానికి పాలా భిషేకం చేసి పూలమాలలు వేశారు

  • Related Posts

    జూమెరత్ ప్రభుత్వ పాఠశాలకు వాటర్ ఫిల్టర్ అందజేత

    వేసవి కాలంలో విద్యార్థులకు తాగునీటి కష్టాలు లేకుండా చేయడానికి యూనిమోని ప్రైవేటు కంపెనీ నిర్మల్ పట్టణంలోని జూమెరత్ ప్రభుత్వ పాఠశాలకు వాటర్ ఫిల్టర్ అందజేసింది. ఈ కార్యక్రమంలో యూనిమోని నిర్మల్ బ్రాంచ్ మేనేజర్ రవి కుమార్, యూనిమోని స్టాఫ్ అఖిలేష్, నర్సయ్య,…

    కార్యాలయానికి కదిలి వచ్చిన “శంకరుడు”

    కార్యాలయానికి కదిలి వచ్చిన “శంకరుడు” ఆదాయ దృవపత్రాల జారీకి ఎందుకంత సమయం..!? ఫరూక్ నగర్ తహాసిల్దార్ పార్థసారధిని ప్రశ్నించిన ఎమ్మెల్యే శంకర్ సాంకేతిక లోపాలు తలెత్తాయని తహసిల్దార్ పార్థసారధి సమాధానం యువతకు సకాలంలో ప్రభుత్వ ధ్రువపత్రాలు జారీచేయాలని ఆదేశాలు సాంకేతిక లోపాలపై…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    హీటెక్కిన ఆంధ్రప్రదేశ్‌.. 150కి పైగా మండలాల్లో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

    హీటెక్కిన ఆంధ్రప్రదేశ్‌.. 150కి పైగా మండలాల్లో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

    జూమెరత్ ప్రభుత్వ పాఠశాలకు వాటర్ ఫిల్టర్ అందజేత

    జూమెరత్ ప్రభుత్వ పాఠశాలకు వాటర్ ఫిల్టర్ అందజేత

    తెలుగువారి తొలి పండగ… ఉగాది!..

    తెలుగువారి తొలి పండగ… ఉగాది!..

    కార్యాలయానికి కదిలి వచ్చిన “శంకరుడు”

    కార్యాలయానికి కదిలి వచ్చిన “శంకరుడు”