

మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడికి మాతృవియోగం
మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 01 ( డొంగ్రే చంద్రమని సీనియర్ జర్నలిస్ట్ ) :- నిర్మల్ జిల్లా తాలూకా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు రోళ్ళ రమేష్ మాతృమూర్తి రోల్ల ముత్తు బాయి మండల కేంద్రమైన ముధోల్ లో శుక్రవారం అర్ధరాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు అంతిమయాత్ర ఉంటుందని రోళ్ల కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రముఖులు రోల్ల కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సామాజిక సేవలో తనదైన ముద్ర వేసిన రోళ్ల రమేష్ కు ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థించారు.