మీడియా అండ్‌ కమ్యూనికేషన్స్‌ అడ్వైజర్‌గా అల్లం నారాయణ

మీడియా అండ్‌ కమ్యూనికేషన్స్‌ అడ్వైజర్‌గా అల్లం నారాయణ

హైదరాబాద్‌: తెలంగాణ సమాచార పౌర సంబంధాల శాఖలో మరో కీలక పరిణామం..! మీడియా అండ్‌ కమ్యూనికేషన్స్‌ అడ్వైజర్‌గా ప్రెస్‌ అకాడమీ మాజీ చైర్మన్‌, సీనియర్‌ పాత్రికేయులు అల్లం నారాయణను నియమించనున్నట్టు తెలిసింది. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్‌ సర్కారు నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. అల్లం నారాయణకు కేబినెట్‌ ర్యాంకులో ఈ హోదాను ప్రకటించే అవకాశాలున్నాయి. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల తరపున కీలక పాత్ర పోషించిన ఆయనను సముచితంగా గౌరవించాలనే ఉద్దేశంతోనే సీఎం రేవంత్‌ సర్కారు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ప్రొఫెసర్‌ కోదండరాం, అందెశ్రీ, సుద్దాల అశోక్‌ తేజలతో పాటు అంబేద్కర్‌ ఓపెన్‌ వర్సిటీ వీసీగా ఘంటా చక్రపాణిలను ప్రజాపాలనలో సముచితంగా గౌరవించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమంలో, మీడియా రంగంలో విశేష సేవలందించిన అల్లం నారాయణ అనుభవాన్ని ప్రజాపాలనలో భాగస్వామ్యం చేయాలని రాష్ట్ర సర్కారు మీడియా అండ్‌ కమ్యూనికేషన్స్‌ అడ్వైజర్‌గా నియమించాలని భావిస్తున్నట్టు సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా చేయనున్నట్టు తెలిసింది

  • Related Posts

    ఆర్థిక సహాయాన్ని అందజేసిన

    జంగరాయి గ్రామానికి చెందిన చిన్నంగల భారతమ్మ అనారోగ్యంతో మృతి చెందారని తెలుసుకొని ఆర్థిక సహాయాన్ని అందజేసిన లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ మనోరంజని వెల్దుర్తి మాసాయిపేట ప్రతినిధి ఏప్రిల్ 4- మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం జంగారాయి…

    శ్రీరామనవమి శోభా యాత్ర సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై…

    శ్రీరామనవమి శోభా యాత్ర సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై… ఇతర వర్గాలను కించపరిచే పాటలు, ప్రసంగాలు వద్దు మనోరంజని ప్రతినిధి హైదరాబాద్‌ సిటీ: ఏప్రిల్ 04 :-నగరంలో నిర్వహించే శ్రీరామ నవమి శోభాయాత్రకు దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉందని, శోభాయాత్రను శాంతియుతంగా, ప్రశాంతంగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఆర్థిక సహాయాన్ని అందజేసిన

    ఆర్థిక సహాయాన్ని అందజేసిన

    వక్ఫ్ బిల్లు ఆమోదంపై మోడీ కీలక వ్యాఖ్యలు

    వక్ఫ్ బిల్లు ఆమోదంపై మోడీ కీలక వ్యాఖ్యలు

    బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారుడు యూనస్‌తో ప్రధాని మోదీ భేటీ

    బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారుడు యూనస్‌తో ప్రధాని మోదీ భేటీ

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి పూజా హెగ్డే

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి పూజా హెగ్డే