మాసాయిపేట మండలం వడ్డరి కాలనీలో సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి

మాసాయిపేట మండలం వడ్డరి కాలనీలో సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన

నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి

మనోరంజని వెల్దుర్తి మాసాయిపేట ప్రతినిధి మార్చ్ 23

మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలోని ఉన్నటువంటి వడ్డరి కాలనీలో నూతనంగా సిసి రోడ్లను ప్రారంభించిన నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పది సంవత్సరాల బి ఆర్ ఎస్ పార్టీ పాలనలో నూతనంగా మండలాలను ఏర్పాటు చేసినటువంటి సందర్భాలలో మాసాయిపేటను మండల కేంద్రంగా ఏర్పాటు చేయడమే కాకుండా ఆలస్యంగా మండలాన్ని ఏర్పాటు చేసి కేవలం రెవెన్యూ మండలాన్ని ఏర్పాటు చేశారని తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో ముఖాముఖిగా మాట్లాడి గజిస్టర్ మండలం గా ఏర్పాటు కావాలని తాను విన్నవించడంతో పరిపూర్ణ మండలాన్ని ఏర్పాటు కోసం ఆదేశాలను ఇవ్వడం జరిగిందని మాసాయిపేట మండల కేంద్రంలోని కేవలం రెవెన్యూ శాఖకు సంబంధించిన అధికారులే గతంలో ఉండే వారని రానున్న స్థానిక ఎన్నికల్లో ఎంపీపీ జడ్పిటిసి మాసాయిపేట మండలానికి ప్రత్యేకంగా అధికారికంగా ప్రభుత్వ శాఖలకు సంబంధించినటువంటి కార్యాలయాలు మాసాయిపేట మండల కేంద్రంలో నిర్మించుకొ నేప్రయత్నంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయడానికి సహకరించడంలో వెనుకంజ వేయకుండా మండల కేంద్రంలోని ఉన్నటువంటి ప్రజలకు ప్రభుత్వం తరఫునుంచి ఎటువంటి సహాయ సహకారాలు కావాలో అన్ని సమకూర్చే బాధ్యత వహించడం జరుగుతుందని మాసాయిపేట మండల కేంద్రంలోని ఉన్నటువంటి ప్రతి గ్రామ ప్రజలు వారికి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే తాను వారి యొక్క సమస్యలను తీర్చడానికి తాను వెనుకంజ వేసేది లేదని నేడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను చూసి ప్రతిపక్ష నాయకులు లేని పోనీ ఆరోపణలు చేయడం సమంజసం కాదని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి పనులలో ఏవైనా అవకతవకలు జరిగితే మాసాయిపేట మండలంలోని ఉన్నటువంటి పలు పార్టీ నాయకులు సమంజసంగా మాతో సహకరించి నూతనంగా మాసాయిపేట మండలం ఏర్పాటు గత ప్రభుత్వంలో అవడం మాకు ఎంతో సంతోషకరమని మా సాయి పేట మండలం గా ఏర్పాటు అయినా కేవలం రెవెన్యూ మండలం గానీ ఏర్పాటు అయిందని రెవెన్యూ మండలాన్ని అధికారికంగా అన్ని కార్యాలను అధికారులను నియమించుకోవడానికి మాసాయిపేట మండల ప్రజల సహకారం ఎంతో అవసరమని ప్రతి ఒక్క చిన్న విషయానికి ప్రతిపక్ష నాయకులు రాధాంత్రం చేసుకుంటూ పోతే మండల అభివృద్ధి ఎలా చెందుతుందని పత్రిక ముఖంగా ప్రశ్నిస్తున్నాను అని ఆయన అన్నారు స్వార్థపర రాజకీయాలతో మాసాయిపేట మండలానికి వచ్చినటువంటి అభివృద్ధి పనులకు ఆటంకం కలిగించవద్దని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఎంపీటీసీ కృష్ణారెడ్డి మాజీ ఎంపీటీసీ సిద్ధిరాములు గౌడ్ మాసాయిపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీకాంత్ రాజిరెడ్డి మాసాయిపేట మండల మాజీ ఉప సర్పంచ్ ఉదండపురం నాగరాజు సొసైటీ డైరెక్టర్ పూదండపురం నరసింహులు చెట్ల తిమ్మాయపల్లి మాజీ సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

  • Related Posts

    షాద్ నగర్ బ్రాహ్మణ సేవ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

    షాద్ నగర్ బ్రాహ్మణ సేవ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ మనొరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 29 : షాద్‌నగర్ నియోజకవర్గ బ్రాహ్మణ సేవా సంఘం 2025 క్యాలెండర్‌ను జిల్లా బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు మంగు రాఘవరావు శనివారం ఆవిష్కరించారు. షాద్‌నగర్…

    శ్రీ విశ్వా వసు నామ సంవత్సరంలో విజయాలు సిద్దించాలి..

    శ్రీ విశ్వా వసు నామ సంవత్సరంలో విజయాలు సిద్దించాలి.. సిద్దిపేట : తెలుగు నూతన సంవత్సరం శ్రీ విశ్వా వసు నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు సిద్దిపేట జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బైకుపై మృతదేహంతో నిరసన.

    బైకుపై మృతదేహంతో నిరసన.

    షాద్ నగర్ బ్రాహ్మణ సేవ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

    షాద్ నగర్ బ్రాహ్మణ సేవ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

    సౌదీ అరేబియాలో శనివారం రాత్రి రంజాన్ నెలవంక దర్శనం.

    సౌదీ అరేబియాలో శనివారం రాత్రి రంజాన్ నెలవంక దర్శనం.

    తమిళ సినిమా ఇండస్ట్రీ సంచలన నిర్ణయం

    తమిళ సినిమా ఇండస్ట్రీ సంచలన నిర్ణయం