

మహిళా పోలీసులకు సముచిత స్థానం
ముధోల్ సిఐ జి. మల్లేష్
మనోరంజని ప్రతినిధి ముధోల్.మార్చి 06 :- మహిళా పోలీస్ సిబ్బందికి సోముచిత స్థానం కల్పించడం జరుగుతుందని ముధోల్ సీఐ జి మల్లేష్ అన్నారు. గురువారం మండల కేంద్రమైన ముధోల్ లోని పోలీస్ స్టేషన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా ఎస్పీ జానకి షర్మిల మహిళా పోలీసులకు అదనపు బాధ్యతలు అప్పగించారు. పురుషులతో సమానంగా 100 డయల్ పెట్రో కార్ విధులతో మహిళ పోలీసుల ఆనందం వ్యక్తం చేశారు. మహిళలు కూడా అన్ని రంగాల్లో ముందుంటారని నిరూపించడానికి జిల్లా ఎస్పీ పెట్రో కార్ విధులను అప్పగించారని పేర్కొన్నారు. పెట్రో కార్ విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీస్ సిబ్బందికి సిఐ అభినందించారు. ఈ సందర్భంగా అధికారులతో పాటు సిబ్బంది చప్పట్లతో మహిళ పోలీస్ సిబ్బందిలో ఉత్సాహం నింపారు. ఈ కార్యక్రమంలో ముధోల్ ఎస్సై సంజీవ్ కుమార్ పోలీస్ సిబ్బంది తదితరులు