

మహాబోధి బుద్ద విహార్ బుద్ధిస్టులకే చెందాలి
మనోరంజని ప్రతినిధి మోర్తాడ్ మార్చి 24 – బీహార్ రాష్ట్రం గాయ జిల్లాలోని “మహాబోధి బుద్ద విహార్” మనువాదుల కభంద హస్తంలో ఉంది. బి.టి చట్టం ఇది సరైనది కాదు. కావున మహాబోధి బుద్ద విహార్ (మందిరం) భారత బుద్ధిస్టులకే చెందాలని మోర్తాడ్ మండల రెవెన్యూ ఆఫీసర్ చెలుకల కృష్ణ ను సోమవారం సాయంత్రం దళిత సంక్షేమ సంఘం (డి.ఎస్.ఎస్) చేత మెమొరెండం అందజేశారు. ఇట్టి పత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వరకు తమ వాయిస్/ డిమాండ్ చేరాలని ఆఫీసర్ ను అంబేడ్కరైట్ ప్రతినిధులు కోరారు. ఇందులో పాలెం అంబేడ్కర్ యువజన సంఘం నాయకులు గాయకులు సురేష్ షాహు, అడ్వకేట్ మామిడి రాజేశ్వర్, జర్నలిస్ట్ సమ్రాట్ అశోక్, జర్నలిస్ట్ గన్నారపు శంకర్. ఈ సందర్భంగా డి.ఎస్.ఎస్ అధ్యక్షులు మల్లురి రాజారాం, ప్రధాన కార్యదర్శి జాంబావ చామార్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా జరుగుతున్న బి.టి చట్టం రద్దుకై తమ సంఘీభావం ఎప్పటికీ ఉంటుందని తెల్పారు. గాయ జిల్లాలోని మహాబోధి బుద్దవిహర్ వద్ద గత 40 రోజుల నుంచి బౌద్ధ భిక్షువుల ద్వారా సాగుతున్న నిరాహార దీక్షకు తమ బీసీల సంపూర్ణ మద్దతు ఉందని తెలంగాణ బీసీ సంఘం నేత ఘోడ్కే రవీందర్ ప్రకటించారు. నివేదిక పత్రం సమర్పణలో ప్రఖ్యాత కవిరాజా, మామిడి గంగాధర్, ఎం.విజయకుమార్, కూన ప్రవీణ్, మూలనివాసి మాలజీ తదితరులు ఉన్నారు.