మయన్మార్ లో 1000 కి చేరిన మరణాల సంఖ్య

మయన్మార్ లో 1000 కి చేరిన మరణాల సంఖ్య

మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 29 – భారీ భూకంపం కారణంగా మయన్మార్, థాయిలాండ్ లు అతలాకుతలం అయ్యా యి. పలు ప్రాంతాల్లో భవనాలు నేలకూలాయి. ఎటుచూసినా కూలిపో యిన భవన శిథిలాలే కనిపిస్తున్నాయి. భారీ భూకంపం కారణంగా రెండు దేశాల్లో ఇప్పటికే మృతుల సంఖ్య 1000 దాటగా.. 2370 మంది గాయపడినట్లు తెలుస్తోంది. అయితే, ఒక్క మయన్మార్ లోనే 694 మంది మరణిం చినట్లు ఆ దేశ మిలిటరీ అధికారులు వెల్లడించారు. రెండు దేశాల్లో ఈ విప్తత్తు కారణంగా మృతుల సంఖ్య 10వేలు దాటే అవకాశం ఉందని అమెరికా ఏజెన్సీ హెచ్చరించడం గమనార్హం.

మరోవైపు సహాయక చర్యలు కొనసాగుతు న్నాయి

భూకంపం కారణంగా ఇప్పటికే అతలాకుతల మైన మయన్మార్ లో మరోసారి ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. శనివారం తెల్లవారు జామున 4.2 తీవ్రతతో భూమి కంపించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మరోవైపు బ్యాంకాక్ లో భూకంపం కారణంగా 10మంది మరణించగా.. ఓ భారీ భవనం కూలిన ఘటనలో దాదాపు 100 మంది నిర్మాణ కార్మికులు గల్లంతయ్యారు.మయన్మార్ లో ప్రకృతి వైపరిత్యాన్ని ఎదుర్కోవడానికి ఐక్య రాజ్యసమితి మద్దతును సేకరిస్తోంది.మయన్మార్, థాయిలాండ్ లలో భూకంప సహాయం, సహాయానికి సింగపూర్ రెడ్ క్రాస్ 150000 డాలర్లు ఇచ్చేందుకు హామీ ఇచ్చిం ది. ఈ నిధిని ఆహారం, నీరు, దుప్పట్లు, టార్పాలి న్, పరిశుభ్రత వస్తు సామాగ్రి, పలు ముఖ్యమైన వస్తువులను ప్రజలకు అందించేందుకు ఉపయో గించనుంనట్లు తెలిపింది. ఇప్పటికే భారత్ ‘ఆపరేషన్ బ్రహ్మ’ కింద మయన్మార్ కు 15టన్నుల సహాయక సామాగ్రిని పంపించింది. టెంట్లు, దుప్పట్లు, స్లీపింగ్ బ్యాగులు, జనరేటర్లు, ఆహార ప్యాకెట్లను అందించింది. సహాయ, రక్షణ కార్యకలాపాల కోసం రష్యా 120 మంది సభ్యుల బృందాన్ని పంపించింది. అమెరికా, ఇండోనేషియా, చైనా కూడా అవసరమైన సాయం అందిస్తామని ముందుకొచ్చాయి.

  • Related Posts

    బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారుడు యూనస్‌తో ప్రధాని మోదీ భేటీ

    బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారుడు యూనస్‌తో ప్రధాని మోదీ భేటీ మనోరంజని ప్రతినిధి* హైదరాబాద్: ఏప్రిల్ 04 – థాయిలాండ్‌లో జరిగిన బిమ్‌స్టెక్ శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్‌తో సమావేశమయ్యారు. శుక్రవారం…

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం.. ఇంటర్నెట్ డెస్క్: మయన్మార్‌లో మరోసారి భూకంపం సంభవించింది. భూకంప తీవ్ర రిక్టర్ స్కేలుపై 5.1గా నమోదైంది. దీంతో ప్రజలు ఒక్కసారిగా ఇళ్ల నుంచి పరుగులు పెట్టారు. 48 గంటల్లో భూకంపం రావడం ఇది…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    వక్ఫ్ బిల్లు ఆమోదంపై మోడీ కీలక వ్యాఖ్యలు

    వక్ఫ్ బిల్లు ఆమోదంపై మోడీ కీలక వ్యాఖ్యలు

    బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారుడు యూనస్‌తో ప్రధాని మోదీ భేటీ

    బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారుడు యూనస్‌తో ప్రధాని మోదీ భేటీ

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి పూజా హెగ్డే

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి పూజా హెగ్డే

    శ్రీరామనవమి శోభా యాత్ర సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై…

    శ్రీరామనవమి శోభా యాత్ర సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై…