మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

ఇంటర్నెట్ డెస్క్: మయన్మార్‌లో మరోసారి భూకంపం సంభవించింది. భూకంప తీవ్ర రిక్టర్ స్కేలుపై 5.1గా నమోదైంది. దీంతో ప్రజలు ఒక్కసారిగా ఇళ్ల నుంచి పరుగులు పెట్టారు. 48 గంటల్లో భూకంపం రావడం ఇది రెండోసారి. మెుదటగా శుక్రవారం మధ్యాహ్నం సంభవించిన భూ విలయం మయన్మార్‌ను కుదిపేసింది. శక్తిమంతమైన భూకంపం ధాటికి 1,664 మంది ప్రాణాలు కోల్పోగా.. 3,408 మంది తీవ్రంగా గాయపడ్డారు. భవనాల కింద చిక్కుకున్న పలువురి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. మరోవైపు మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు అంచనా వేస్తున్నారు. కొండ ప్రాంతాలు, రెబల్స్‌ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మరణాలను అధికారులు ఇంకా లెక్కించలేదు. వాటినీ పరిగణనలోకి తీసుకుంటే మృతుల సంఖ్య ఏకంగా 10 వేలు దాటే అవకాశం ఉందని అమెరికాకు చెందిన జియోలాజికల్‌ సర్వే(యూఎస్జీఎస్‌) వెల్లడించింది. మయన్మార్‌ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో దీని ప్రభావం పడింది. పదుల కొద్దీ భవంతులు నెలమట్టం అయ్యాయి. వేల మంది నిరాశ్రయులు అయ్యారు. భవనాలు కూలిపోయిన సంఘటనలకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, ఆదివారం ఉదయం ఇండోనేషియాలోనూ భూకంపం వచ్చింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 4.6గా నమోదైంది. సుమత్ర దీవుల్లో భూకంప కేంద్రం ఉన్నట్లు స్థానిక అధికారులు గుర్తించారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు

  • Related Posts

    బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారుడు యూనస్‌తో ప్రధాని మోదీ భేటీ

    బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారుడు యూనస్‌తో ప్రధాని మోదీ భేటీ మనోరంజని ప్రతినిధి* హైదరాబాద్: ఏప్రిల్ 04 – థాయిలాండ్‌లో జరిగిన బిమ్‌స్టెక్ శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్‌తో సమావేశమయ్యారు. శుక్రవారం…

    బ్యాంకాక్ భూకంపం.. క్షేమంగా హైదరాబాద్‌కు తెలంగాణ ఎమ్మెల్యే కుటుంబం

    బ్యాంకాక్ భూకంపం.. క్షేమంగా హైదరాబాద్‌కు తెలంగాణ ఎమ్మెల్యే కుటుంబం హైదరాబాద్: థాయ్‌లాండ్, మయన్మార్ దేశాల్లో చోటు చేసుకున్న వరుస భూకంపాలు తీవ్ర విధ్వంసాన్ని మిగిల్చాయి. శుక్రవారం నాడు సంభవించిన భూకంపాల ధాటికి.. వందల నిర్మాణాలు కుప్పకూలాయి. మయన్మార్, థాయ్‌లాండ్ రెండు దేశాల్లో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఆర్థిక సహాయాన్ని అందజేసిన

    ఆర్థిక సహాయాన్ని అందజేసిన

    వక్ఫ్ బిల్లు ఆమోదంపై మోడీ కీలక వ్యాఖ్యలు

    వక్ఫ్ బిల్లు ఆమోదంపై మోడీ కీలక వ్యాఖ్యలు

    బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారుడు యూనస్‌తో ప్రధాని మోదీ భేటీ

    బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారుడు యూనస్‌తో ప్రధాని మోదీ భేటీ

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి పూజా హెగ్డే

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి పూజా హెగ్డే