భైంసా మున్సిపాలిటీ పై బిజెపి జెండా ఎగరవేస్తాం

భైంసా మున్సిపాలిటీ పై బిజెపి జెండా ఎగరవేస్తాం

     కష్టపడ్డ కార్యకర్తలకు గుర్తింపు ఉంటుంది

ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్

  ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంతో పటేల్ను సన్మానించిన పట్టణ బిజెపి కమిటీ

మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 09 :- నిర్మల్ జిల్లా బైంసా మున్సిపాలిటీ పై కాషాయ జెండా ఎగరవేయడమే తమ లక్ష్యమని వచ్చే ఎన్నికల్లో మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కచ్చితంగా దక్కించుకుంటామని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. రెండు ఎమ్మెల్సీ ఎన్నికల విజయంతో బిజెపి పట్టణ కమిటీ నాయకులు ఆదివారం అధ్యక్షులు ఎనపోతుల మల్లేష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ని సన్మానించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. భైంసా లో మున్సిపాలిటీ పై బిజెపి జెండా ఎగరవేయడం, కార్యకర్తల ఎన్నో సంవత్సరాల కల, అని అందుకు అనుగుణంగా ముందుకు సాగుతానన్నారు. తాను ఎమ్మెల్యే అయ్యాక ఇక్కడ జరిగిన ఎన్నికల్లో ప్రతిసారి బిజెపికి మెజార్టీ వచ్చిందని ఈ సందర్భంగా ఓటర్లకు, కష్టపడ్డ నాయకులకు కార్యకర్తలకు, కృతజ్ఞతలు తెలియజేశారు. కష్టపడిన వారికి బిజెపి పార్టీ ఖచ్చితంగా గుర్తిస్తుందన్నారు. బిజెపి పట్టణ ఎ ను పోతుల మల్లేష్ మాట్లాడుతూ తమ నాయకుడు అన్న మాట ప్రకారం రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కైవసం చేసుకున్నామని, ఇదే మాట ప్రకారం కష్టపడి మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంటామన్నారు. సన్మాన కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బి గంగాధర్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు

  • Related Posts

    హోలీ సంబరాలతో అలరించిన ఆర్మూర్ పట్టణం

    మనోరంజని ప్రతినిధి ఆర్మూర్ మార్చి 15 – ఆర్మూర్ పట్టణంలో హోలీ పండుగను ప్రజలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం నుండే యువత భారీ సంఖ్యలో వీధుల్లోకి వచ్చి రంగులు చల్లుకుంటూ హుషారుగా సంబరాలు చేసుకున్నారు. మున్సిపల్ పరిధిలోని పెర్కిట్, మామిడిపల్లి,…

    కుంటాల మండలంలోని హోలీ సంబరాలు

    కుంటాల మండలంలోని హోలీ సంబరాలు మనోరంజని మార్చ్14: నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలోని అన్ని గ్రామాలలో హోళీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఒకరినొకరు రంగులు చల్లుకుంటూ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు అందరి జీవితాలు రంగుల మాయం కావాలని ఆకాంక్షించారు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    నిందితునికి 8 నెలల శిక్ష: వేములవాడ టౌన్ సీఐ

    నిందితునికి 8 నెలల శిక్ష: వేములవాడ టౌన్ సీఐ

    ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం: ప్రజల హక్కుల పరిరక్షణకు ప్రత్యేక చట్టాలు

    ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం: ప్రజల హక్కుల పరిరక్షణకు ప్రత్యేక చట్టాలు

    హోలీ సంబరాలతో అలరించిన ఆర్మూర్ పట్టణం

    హోలీ సంబరాలతో అలరించిన ఆర్మూర్ పట్టణం