బ్యాంకు ఉద్యోగస్తుల సమ్మె వాయిదా..?

బ్యాంకు ఉద్యోగస్తుల సమ్మె వాయిదా..?

మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 22 – బ్యాంకు ఉద్యోగులుతమ డిమాండ్లను నెరవేర్చా లంటూ మార్చి 24, 25 తేదీల్లో ది యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ యూఎఫ్‌ బీయూ, సమ్మె చేస్తామని ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే, యూఎఫ్‌బీయూ, సెంట్రల్ లేబర్ కమిషనర్ మధ్య శుక్రవారం సాయంత్రం సమావేశం జరిగింది. దీనిపై చర్చలు జరిపిన తరువాత రెండు రోజుల దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె నిర్ణయాన్ని యూఎఫ్‌బీయూ వెనక్కి తీసుకుంది.ఐదు రోజుల పనిదినాల డిమాండ్ అమలు విష యాన్ని తాను వ్యక్తిగతంగా పరిశీలిస్తానని కేంద్ర కార్మిక కమిషనర్ హామీ ఇచ్చారని చెప్పింది. ఈ సానుకూల పరిణామాల నేపథ్యంలో సమ్మెను ఒకటి లేదా రెండు నెలలు వాయిదా వేయా లని తాము నిర్ణయించుకు న్నామని పేర్కొంది. తదుపరి రౌండ్ చర్చలు ఏప్రిల్ మూడవ వారంలో జరగనున్నాయి.యూఎఫ్‌బీయూ మొదట తీసుకున్న నిర్ణయం ప్రకారం.. సమ్మె జరిగితే మార్చి 22 నుంచి మార్చి 25 వరకు దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలిగేది. ఎందుకంటే మార్చి 23న కూడా బ్యాంకులకు సెలవు దినం ఉంది. సమ్మె జరిగితే దీనివల్ల నగదు లావాదేవీలు, చెక్ క్లియరింగ్, చెల్లింపులు, రుణాల ప్రక్రియ వంటి వాటిపై ప్రభావం పడేది. యూఎఫ్‌బీయూలో ఏఐబీఈఏ, ఏఐబీఓసీ, ఎన్‌సీబీఈ, ఏఐబీఓఏ సహా 9 బ్యాంకు ఉద్యోగుల సంఘాలు ఉంటాయి. ఈ ప్రభుత్వ, ప్రైవేట్, విదేశీ, సహకార, ప్రాంతీయ గ్రామీ ణ బ్యాంకులలో ఎనిమిది లక్షలకు పైగా ఉద్యోగులు పనిచేస్తుంటారు. యూఎఫ్‌బీయూ డిమాండ్లలో ప్రస్తుత ఉద్యోగులపై పనిభారాన్ని తగ్గించడానికి, కస్టమర్ సేవలను మెరుగుపరచ డానికి అన్ని కేడర్లలో సిబ్బం దిని నియమించాలన్న డిమాండ్ కూడా ఉంది

  • Related Posts

    పట్టు సాగు, మరియు ఉత్పత్తికి రైతులు ముందుకు రావాలి.

    పట్టు సాగు, మరియు ఉత్పత్తికి రైతులు ముందుకు రావాలి. -జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. మనొరంజని న్యూస్, మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి. మంచిర్యాల జిల్లా చెన్నూర్ లో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ దసలి పట్టు కృషి మేళా…

    అడిషనల్ కలెక్టర్ కి సేవాలాల్ మహారాజ్ ఆలయ ప్రారంభోత్సవ ఆహ్వానం

    అడిషనల్ కలెక్టర్ కి సేవాలాల్ మహారాజ్ ఆలయ ప్రారంభోత్సవ ఆహ్వానం మనోరంజని న్యూస్, మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గం ప్రతినిధి. మంచిర్యాల జిల్లా, భీమారం మండల కేంద్రంలో ని బూరుగుపల్లి గ్రామంలో నూతనంగా ప్రారంభిస్తున్న సేవాలాల్ మహారాజ్ ఆలయ ప్రారంభోత్సవం, మరియు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    పట్టు సాగు, మరియు ఉత్పత్తికి రైతులు ముందుకు రావాలి.

    పట్టు సాగు, మరియు ఉత్పత్తికి రైతులు ముందుకు రావాలి.

    అడిషనల్ కలెక్టర్ కి సేవాలాల్ మహారాజ్ ఆలయ ప్రారంభోత్సవ ఆహ్వానం

    అడిషనల్ కలెక్టర్ కి సేవాలాల్ మహారాజ్ ఆలయ ప్రారంభోత్సవ ఆహ్వానం

    ఆశ వర్కర్లను అరెస్టు చేయడం అన్యాయం

    ఆశ వర్కర్లను అరెస్టు చేయడం అన్యాయం

    కెమెరాలే నిరసన ప్రకటిస్తే…

    కెమెరాలే నిరసన ప్రకటిస్తే…