బుల్లి రాజు డిమాండ్.. రోజుకి లక్ష

బుల్లి రాజు డిమాండ్.. రోజుకి లక్ష

బుడ్డోడే కానీ.. డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ లో ఎవర్నీ తీసిపోడు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ పెద్ద హిట్ అయ్యింది. దాంతో పాటు బుల్లి రాజుకీ అవకాశాలు వరుస కడుతున్నాయి. ‘సంక్రాంతికి వస్తున్నాం’ రిలీజ్ అయ్యాక ఇప్పటి వరకూ దాదాపు 20 ఆఫర్లు వచ్చాయట. కానీ.. బుల్లి రాజు దేనికీ కమిట్ అవ్వడం లేదు. ఒకవేళ అయినా, రోజుకు రూ.లక్ష పారితోషికం అడుగుతున్నాడట. నిర్మాతలు కూడా అడిగినంత ఇవ్వడానికి రెడీనే అంటున్నారు. తాజాగా అనిల్ రావిపూడి మరో సినిమాలో ఈ బుల్లి రాజుని లాక్ చేసినట్టు తెలుస్తోంది. చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ఇందులో కూడా బుల్లిరాజుకు ఓ మంచి పాత్ర పడిందని తెలుస్తోంది. కథానాయికగా మృణాల్ ఠాకూర్ పేరు గట్టిగా వినిపిస్తోంది. అంజలి ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. అయితే చిత్రబృందం ఎలాంటి ప్రకటనా చేయడం లేదు. జూన్ లేదా జూలైలో చిత్రీకరణ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. 2026 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేసే సన్నాహాల్లో ఉన్నారు. భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఆల్రెడీ ఓ ట్యూన్ రెడీ అయ్యిందని, ఈ పాటని రమణ గోగుల పాడబోతున్నారని తెలుస్తోంది

  • Related Posts

    బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్‌.. సెలబ్రిటీలపై కేసులు నమోదు

    బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్‌.. సెలబ్రిటీలపై కేసులు నమోదు బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోట్‌ చేస్తోన్న పలువురు సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, టీవీ నటులపై కేసులు నమోదయ్యాయి. ఇమ్రాన్‌ ఖాన్‌, హర్ష సాయి, టెస్టీ తేజ, కిరణ్‌ గౌడ్‌, విష్ణుప్రియ, యాంకర్‌ శ్యామల, రీతూ చౌదరి,…

    బాసరలో అలరించిన అష్టావధానం మనోరంజని ప్రతినిధి బాసర మార్చి 16 :- చదువుల తల్లి పుణ్యక్షేత్రమైనా బాసరలోని శారద నగర్ లో గల కోటి పార్థివ లింగస్తూప సాహితి ద్వాదశ జ్యోతిర్లింగ మందిరం హాల్లో ఆదివారం విశాఖపట్నం వాస్తవ్యులు ప్రముఖ అవదానులు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    నేటి నుంచి ఎమ్మెల్యే ఎమ్మెల్సీల ఆటల పోటీలు ప్రారంభం

    నేటి నుంచి ఎమ్మెల్యే ఎమ్మెల్సీల ఆటల పోటీలు ప్రారంభం

    ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్రత కల్పించడం సంతోషంగా ఉంది.

    ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్రత కల్పించడం సంతోషంగా ఉంది.

    గ్రామస్తులకు 14 లక్షల ప్రొసీడింగ్ కాపీ అందజేత

    గ్రామస్తులకు 14 లక్షల ప్రొసీడింగ్ కాపీ అందజేత

    ప్రజల కోసం బోరు వేయించిన మాజీ ఎమ్మెల్యే

    ప్రజల కోసం బోరు వేయించిన మాజీ ఎమ్మెల్యే