

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ పేరు పరిశీలన..
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీన్ కుమార్ పేరును మాజీ సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నారు. సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. ఈ రోజు సాయంత్రానికి అభ్యర్థిని కేసీఆర్ ఖరారు చేయున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌తోపాటు రేసులో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఉన్నారు. ఇక బీసీ కోటాలో జోగు రామన్న, బూడిద బిక్షమయ్య గౌడ్, దాసోజు శ్రావణ్ ఉన్నారు. సోమవారం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్ వేయనున్నారు. గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీకి దూరంగా ఉన్న బీఆర్ఎస్… ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయాలని నిర్ణయించింది. ఈ ఎన్నికలలో బీఆర్ఎస్ రెండు స్థానాలకు పోటీ చేయనుంది. ఈ విషయంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేశారు. అభ్యర్థులను ఈరోజు సాయంత్రం కేసీఆర్ ఖారారు చేస్తారు. రేపు నామినేషన్ దాఖలు చేస్తారు. వాస్తవానికి ఎమ్మెల్యేల బలాబలాలను బట్టి చూస్తే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో బీఆర్ఎస్ ఒక్క స్థానాన్ని మాత్రమే గెలుచుకునే అవకాశం ఉంది. అయినా కూడా ఇద్దరిని నిలబెట్టాలని పార్టీ అధినేత వ్యూహాత్మకంగా నిర్ణయించారు.పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలనూ కలుపుకుంటే బీఆర్ఎస్కు అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 38 వరకు ఉంది. ఇప్పుడు ఫిరాయింపు ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలుస్తారా.. లేక బీఆర్ఎస్కు ఓటు వేస్తారా.. అన్న విషయంలో రాజకీయ వర్గాలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్ కోర్టులో పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలలో వారు తీసుకునే నిర్ణయంపై సందిగ్ధత నెలకొంది. ఈ క్రమాలో కేసీర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో రెండు స్థానాలలో అభ్యర్థులను నిలబెట్టాలని నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది..