బాసర్ నుండి మాహుర్ కు జాతీయ రహదారి నిర్మాణం కోసం ప్రతిపాదన పంపండి

బాసర్ నుండి మాహుర్ కు జాతీయ రహదారి నిర్మాణం కోసం ప్రతిపాదన పంపండి

అర్లీ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు ఇవ్వండి
శాసనసభలో ఎమ్మెల్యే పవా ర్ రామారావు పటేల్

మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 26 :- బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం నుండి మహారాష్ట్రలోని మహోర్ రేణుక మాత టెంపుల్ 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని, జాతీయ రహదారి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ కోరారు. బాసర టు మహుర్ కు జాతీయ రహదారి కావాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి ని కలవడం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపిస్తే తప్పకుండా ఆమోదిస్తామని ఆయన చెప్పారన్నారు. ఈ విషయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించి, ప్రతిపాదన పంపిస్తే మా ప్రాంత ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. అదేవిధంగా గత ప్రభుత్వ హాయంలో అర్లి బ్రిడ్జి నిర్మాణానికి 56 కోట్ల నిధులు మంజూరు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తీసుకుందని, తక్షణమే హం పథకం కింద ఈ బ్రిడ్జిని పూర్తి చేయాలన్నారు. ఆర్లే బ్రిడ్జి నిర్మాణం జరిగితే లోకేశ్వరం, కుంటాల, బాసర, బైంసాతో పాటు అన్ని మండలాల ప్రజలకు రాకపోకలకు సౌకర్యంగా ఉంటుందన్నారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు.

  • Related Posts

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక మనోరంజని ప్రతినిధి కుంటాల మార్చి 30 :- నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘ సభ్యుల సమావేశంలో తోట రఘు…

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

    సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క,ట్రైకార్ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్‌కు కృతజ్ఞతలు ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం తెలంగాణ ప్రభుత్వం గోరు బోలి (లంబాడా) భాషను భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో చేర్చేందుకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం