బర్డ్‌ ఫ్లూ ఎఫెక్ట్..

బర్డ్‌ ఫ్లూ ఎఫెక్ట్..

కోళ్లఫారాల్లో పెరుగుతున్న గుడ్ల నిల్వలు

చెన్నై: నామక్కల్‌ కోళ్ల ఫారాల్లో 2 కోట్ల గుడ్లు నిల్వ ఉండడంతో యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నామక్కల్‌ మండల పరిధిలో నామక్కల్‌, ఈరోడ్‌, తిరుప్పూర్‌, పల్లడం తదితర ప్రాంతాల్లో 6 కోట్లకు పైగా కోళ్లను పెంచుతున్నారు. ఆ కోళ్లు ప్రతిరోజు 5 కోట్ల గుడ్లు పెడుతుంటాయి. ఈ గుడ్లను రాష్ట్ర ప్రభుత్వ పౌష్టికాహార పథకంలో వినియోగిస్తుండగా, పొరుగు రాష్ట్రాలు, విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బర్డ్‌ ఫ్లు విస్తరణ, ఎండల కారణంగా ప్రజలు కోడిగుడ్ల వినియోగం తగ్గించారు.దీంతో, కోళ్ల ఫాంలలో గుడ్లు నిల్వలు పెరుగుతున్నాయి. డిమాండ్‌ తగ్గడంతో ఐదు రోజుల్లో గుడ్డుపై సుమారు 1.10 పైసలు తగ్గించి ప్రస్తుతం ఫాం ధర 3.80 పైసలుగా ఉంది. ప్రస్తుతం పాంలలో 2 కోట్ల గుడ్లు నిల్వ ఉన్నాయని, మరో రెండు రోజుల్లో ఇవి పాడయ్యే అవకాశముందని, అలాగే, నిల్వలు కూడా పెరిగే అవకాశముందని ఫాం యజమానులు వాపోతున్నారు

  • Related Posts

    ఇది కదా పోలీసుల పవర్..

    ఇది కదా పోలీసుల పవర్.. నడిరోడ్డుపై గూండాలకు చుక్కలు.. కత్తులు, కర్రలతో దాడి.. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ వస్త్రల్ ఏరియాలో గత కొద్ది రోజుల నుంచి రౌడీలు రెచ్చిపోతున్నారు. హోలీకి ఒకరోజు ముందు మార్చి 13వ తేదీన 20 మంది రౌడీలు…

    రోడ్డు ప్రమాదం.. బాలుడు మృతి, ఐదుగురికి గాయాలు

    రోడ్డు ప్రమాదం.. బాలుడు మృతి, ఐదుగురికి గాయాలు మనోరంజని ప్రతినిధి నిజామాబాద్ మార్చి 16 :- నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైపాస్ రోడ్డుపై కారు అదుపుతప్పి బోల్తా పడింది. బోల్తా పడే క్రమంలో సైకిల్‌పై వెళ్తున్న బాలుడిని…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఎన్ హెచ్ ఆర్ సి. కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా వడ్ల సాయి కృష్ణ.

    ఎన్ హెచ్ ఆర్ సి. కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా వడ్ల సాయి కృష్ణ.

    ఇది కదా పోలీసుల పవర్..

    ఇది కదా పోలీసుల పవర్..

    ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన రెహమాన్

    ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన రెహమాన్

    జనగామ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి, శంకుస్థాపన

    జనగామ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి, శంకుస్థాపన