బండ్లగూడలో తీగ లాగితే బంగ్లాదేశ్‌లో కదిలిన డొంక

బండ్లగూడలో తీగ లాగితే బంగ్లాదేశ్‌లో కదిలిన డొంక

తీగ లాగితే కదిలిన డొంక.. అమ్మాయిల అక్రమ రవాణా కేసులో వెలుగులోకి సంచలనాలు!

బంగ్లాదేశీయుల అక్రమ రావాణాపై NIA, ED ఉక్కుపాదం మోపింది. హైదరాబాద్‌ బండ్లగూడ కేసులో తీగ లాగితే డొంక కదిలింది. బంగ్లాదేశ్‌ అమ్మాయిల అక్రమ రవాణాలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పక్కా ఫ్లాన్‌తో బంగ్లాదేశ్ నుండి అమ్మాయిలను బార్డర్ దాటిస్తున్నట్లు గుర్తించారు. ఇక్కడికి తీసుకు వచ్చాక వారి చేత చేయించే పనులు చూసి అధికారులే షాక్ అయ్యారు. బంగ్లాదేశీయుల అక్రమ రావాణాపై NIA, ED ఉక్కుపాదం మోపింది. హైదరాబాద్‌ బండ్లగూడ కేసులో తీగ లాగితే డొంక కదిలింది. బంగ్లాదేశ్‌ అమ్మాయిల అక్రమ రవాణాలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పక్కా ఫ్లాన్‌తో బంగ్లాదేశ్ నుండి అమ్మాయిలను బార్డర్ దాటిస్తున్నట్లు గుర్తించారు. ఇక్కడికి తీసుకు వచ్చాక వారి చేత చేయించే పనులు చూసి అధికారులే షాక్ అయ్యారు.

బంగ్లాదేశీయుల అక్రమ రవాణా విషయంలో NIA, ఈడీ రంగంలోకి దిగాయి. ఇటీవల హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్, ఖైరతాబాద్, సనత్‌నగర్ ప్రాంతాల్లో 20మంది బంగ్లాదేశీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. మూడు కేసులు నమోదు చేసి విచారించగా.. బంగ్లాదేశ్ అమ్మాయిల అక్రమ రవాణాకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జాబ్ ఆఫర్ల పేరుతో బంగ్లాదేశ్ నుండి అమ్మాయిలను బార్డర్ దాటిస్తున్నట్లు గుర్తించారు. బంగ్లాదేశ్ నుంచి అమ్మాయిలను పని కోసం హైదరాబాద్ తీసుకొచ్చి వారితో కొన్ని ముఠాలు వ్యభిచారం చేయిస్తున్నట్లు తేల్చారు. ఈ కేసులో పలువురు ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే.. హైదరాబాద్ పోలీసుల సమాచారం ఆధారంగా NIA కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. బంగ్లాదేశీయులు అక్రమంగా భారత్‌లోకి ఎలా వస్తున్నారనే దానిపై ఎన్ఐఏ విచారణకు ఆదేశించింది. బంగ్లా యువకులు ఓలా, ఉబర్ డ్రైవర్లుగా పని చేస్తూ అమ్మాయిలను చెర వేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వీరంతా భారత్‌కు వచ్చి ఆధార్ కార్డులను సంపాదించి భారత పౌరులుగా చలామణి అవుతున్నట్లు గుర్తించారు. మరోవైపు.. బంగ్లాదేశ్ యువతుల అక్రమ రవాణాపై ఈడీ అధికారులు కూడా దూకుడు పెంచారు. వ్యభిచారం ద్వారా సంపాదించిన డబ్బును నిందితులు పలు మార్గాల్లో బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలిస్తున్నట్టు గుర్తించింది. దాంతో.. మనీలాండరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోణంలో దర్యాప్తు చేస్తోంది ఈడీ. బండ్లగూడలో నమోదైన కేసులో ఆస్తులను అటాచ్ చేశారు ఈడీ అధికారులు. హైదరాబాద్‌లోని ఏజెంట్‌ ఇంట్లో సోదాలు నిర్వహించిన ఈడీ.. పేటీఎం వాలెట్‌లోని లక్షా 90వేల రూపాయలను సీజ్ చేసింది.

  • Related Posts

    హైదరాబాద్ వాసులకు హెచ్చరిక.. బయట అస్సలు తిరగకండి..

    హైదరాబాద్ వాసులకు హెచ్చరిక.. బయట అస్సలు తిరగకండి.. ఏప్రిల్ ఎండలు మండు అని చదివే ఉంటారు. కానీ, మార్చి నెల మొదలైన నాటినుంచే ఎండలు దంచి కొడుతున్నాయి. బయట తిరగాలంటే బయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మధ్యాహ్నం పూట ఎండలు భగభగ మంటున్నాయి.…

    నాతో ఎంజాయ్ చేయ్, జాబ్ పర్మినెంట్ చేస్తా’..

    నాతో ఎంజాయ్ చేయ్, జాబ్ పర్మినెంట్ చేస్తా’.. కోర్టు బెంచ్‌ క్లర్క్ లైంగిక వేధింపులు..! భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం వెలుగులోకి వచ్చింది. అందరికీ న్యాయం జరిగే కోర్టులోనే మహిళా ఉద్యోగికి లైంగిక వేధింపులు ఎదురైయ్యాయి. ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఎలికట్ట భవాని మాత దేవాలయ పూజారి శివ శంకర్ భవాని ప్రసాద్ కు సర్ సివి రామన్ అకాడమీ ద్వారా గుర్తింపు

    ఎలికట్ట భవాని మాత దేవాలయ పూజారి శివ శంకర్ భవాని ప్రసాద్ కు సర్ సివి రామన్ అకాడమీ ద్వారా గుర్తింపు

    హైదరాబాద్ వాసులకు హెచ్చరిక.. బయట అస్సలు తిరగకండి..

    హైదరాబాద్ వాసులకు హెచ్చరిక.. బయట అస్సలు తిరగకండి..

    నాతో ఎంజాయ్ చేయ్, జాబ్ పర్మినెంట్ చేస్తా’..

    నాతో ఎంజాయ్ చేయ్, జాబ్ పర్మినెంట్ చేస్తా’..

    కులం కేన్సర్ వంటిది – మతం మహమ్మారి వంటిది .

    కులం కేన్సర్ వంటిది – మతం మహమ్మారి వంటిది .