ఫామ్‌హౌస్ కేసు.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీకి రెండోసారి నోటీసులు..

ఫామ్‌హౌస్ కేసు.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీకి రెండోసారి నోటీసులు..

హైదరాబాద్: ఫామ్‌హౌస్‌లో కోడిపందాల కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి మొయినబాద్ పోలీసులు రెండోసారి నోటీసులు ఇచ్చారు. విచారణకు రావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. మాదాపూర్‌లో ఉంటున్న ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి ఇంటికి పోలీసులు ఈ మేరకు నోటిసులు అంటించారు.

కాగా ఫామ్‌హౌస్‌లో కోడిపందాల కేసులో మొదటిసారి నోటీసులు అందుకున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఫిబ్రవరి 17న పోలీసులకు వివరణ ఇచ్చారు. కోడి పందాలు జరిగిన ఫామ్ హౌస్ ఎమ్మెల్సీది కావడంతో పోలీసులు నోటీసులు ఇచ్చారు. వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని, అలాగే ఫామ్‌హౌస్‌కు సంబంధించి వివరాలు ఇవ్వాలని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. దీంతో న్యాయవాదితో కలిసి వచ్చిన ఎమ్మెల్సీ.. మొయినాబాద్ పోలీసులకు లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చారు. కోడి పందాలు ఆడించిన ఫామ్ హౌస్ తనదేనని 2023 వర్రా రమేష్ కుమార్ రెడ్డికి లీజ్‌కు ఇచ్చినట్లు పోచంపల్లి పేర్కొన్నారు.

రమేష్ కుమార్‌తో పాటు మరొకరి కూడా లీజ్‌కు ఇచ్చినట్లు వెల్లడించారు. లీజ్ పత్రాలను కూడా పోలీసులకు పోచంపల్లి అందజేశారు. లీజ్‌కు ఇచ్చిన భూమిని ఏపీకి చెందిన వ్యాపారి భూపతి రాజు శివ కుమార్ వర్మ అలియాస్ గబ్బర్ సింగ్ తీసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు. కోడి పందాలకు తనకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులకు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి వివరణ ఇచ్చారు.
కాగా.. భూపతిరాజు శివకుమార్ వర్మ అలియాస్ గబ్బర్ సింగ్ అనే వ్యక్తి అదే ఫామ్‌హౌస్‌‌లో రెండు మూడు సార్లు పెద్దఎత్తన కోడిపందాలు, క్యాసినోలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇటీవల మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌లో మరోసారి కోడిపందాలు నిర్వహించాడు. సంక్రాంతి పండగ తర్వాత మిగిలిన కోళ్లను ఫామ్‌హౌస్‌కు తీసుకువచ్చి కోడిపందేలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇందులో చాలామంది బిజినెస్‌మెన్స్‌, రియల్‌ఎస్టేట్ వ్యాపారులు కోడిపందాలకు హాజరయ్యారు. దీనిపై పక్కా సమాచారంతో ఎస్వోటీ పోలీసులు ఫామ్‌హౌస్‌పై దాడులు చేశారు. అయితే అప్పటికే పలువురు తప్పించుకోగా.. కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోళ్ల పందాలు నిర్వహిస్తున్న భూపతి రాజు శివకుమార్‌‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ దాడిలో మొత్తం 64 మందిని అరెస్టు చేశారు. పందాలకు వినియోగిస్తున్న రూ.30 లక్షల నగదు, 55 లగ్జరీ కార్లు, పందాల కోసం ఉపయోగించే 86 కోళ్లు, కోడి కత్తులను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో 10 మంది తెలంగాణకు చెందిన వారు కాగా.. మిగిలిన వారు అంతా ఏపీ వాసులే. ఈ వ్యవహారంపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో గేమింగ్ చట్టం, జంతువులపై క్రూరత్వం నిరోధక చట్టం కింద కేసు నమోదు అయ్యాయి.

అయితే ఈ ఫామ్‌హౌస్ యజమానిగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ ఉండటంతో ఆయనకు నోటీసులు ఇచ్చారు పోలీసులు. దీంతో నోటీసులు అందుకున్న ఎమ్మెల్సీ తన న్యాయవాదితో కలిసి మొయినాబాద్‌ పోలీసులకు లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చారు. ఈ కోడిపందాలకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్సీ స్పష్టం చేశారు. అయితే ఈ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీని కూడా పోలీసులు నిందితుడిగా చేర్చారు. ఈ క్రమంలో విచారణకు రావాల్సిందిగా శ్రీనివాస్ రెడ్డి రెండోసారి పోలీసులు నోటీసులు ఇచ్చారు.. KP

  • Related Posts

    ధర్మబధ్ధంగా జీవితం గడపాలనే ఉద్దేశ్యంతో కామ దహనం

    ధర్మబధ్ధంగా జీవితం గడపాలనే ఉద్దేశ్యంతో కామ దహనం షాద్ నగర్ గంజ్ లో రాత్రి 11 గంటలకు కాముడి దహనం భౌతిక కామ వాంఛలన్నీ తగలబెట్టి, ధర్మబధ్ధంగా జీవితం గడపాలనే ఉద్దేశ్యంతో కామ దహనం యొక్క పరమార్ధం. మన భారతీయ హిందూ…

    సీపీని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ జడ్పి చైర్మన్

    సీపీని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ జడ్పి చైర్మన్ మనోరంజని ప్రతినిధి నిజామాబాద్ మార్చి 13 :- నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన సాయి చైతన్యను గురువారం మాజీ జడ్పి చైర్మన్ దాదన్న గారి విఠల్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ధర్మబధ్ధంగా జీవితం గడపాలనే ఉద్దేశ్యంతో కామ దహనం

    ధర్మబధ్ధంగా జీవితం గడపాలనే ఉద్దేశ్యంతో కామ దహనం

    సీపీని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ జడ్పి చైర్మన్

    సీపీని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ జడ్పి చైర్మన్

    పాఠశాలల్లో ముందస్తుగా హోలీ పండుగ సంబరాలు

    పాఠశాలల్లో ముందస్తుగా హోలీ పండుగ సంబరాలు

    గ్రామాల్లో ఘనంగా కామ దహనం

    గ్రామాల్లో ఘనంగా కామ దహనం