

ప్రతి ఒక్క విద్యార్థి శాస్త్రవేత్త కావాలి: గంగా కిషన్
మనోరంజని ప్రతినిధి బోధన్ ఫిబ్రవరి 28 :-నేషనల్ సైన్స్ డే సందర్భంగా శుక్రవారం విజయ సాయి ఉన్నత పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సైన్స్ ఆఫీసర్ గంగా కిషన్ మాట్లాడుతూ, “ప్రకృతిని గమనించి ప్రశ్నలు అడగడం ద్వారా శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందుతుంది. ప్రతి విద్యార్థి శాస్త్రవేత్త కావడానికి నేటి శాస్త్ర దినోత్సవాలను సద్వినియోగం చేసుకోవాలి” అని పేర్కొన్నారు.అనంతరం, సైన్స్ అధ్యాపకులను ఉద్దేశించి, విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. “ప్రశ్నిస్తేనే జవాబులు వస్తాయి. ఇదే శాస్త్ర దృష్టికి మెట్టుపెట్టుగా మారుతుంది” అని ఆయన అభిప్రాయపడ్డారు.కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ కృష్ణమోహన్, అకడమిక్ ఇన్చార్జ్ సువర్చల, మేనేజర్ చక్రవర్తి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం, అటల్ టింకరింగ్ ల్యాబ్లో విద్యార్థులు రూపొందించిన ప్రదర్శనలను పరిశీలించిన గంగా కిషన్, ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు
