ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలి

త్వరలో మున్సిపాలిటీలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు

కాలినడకన మున్సిపాలిటీలో ప్రజా సమస్యలపై ఆరా

షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

మనోరంజన రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 03 : ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు.కొత్తూరు మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షుడు సుదర్శన్ గౌడ్ ఆధ్వర్యంలో అభివృద్ధిపై కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని 2 ,3, 8 ,9,10 ,11,12 వార్డుల్లో సోమవారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పర్యటించి చేయాల్సిన పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..అసంపూర్తిగా ఉన్న సిసి రోడ్లు,డ్రైనేజీ పనులు త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు.అలాగే వేసవికాలం దృష్టిలో ఉంచుకొని మిషన్ భగీరథ నీటి సరఫరా లో ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.అలాగే స్టేషన్ తిమ్మాపూర్ లో అంగన్వాడికి మరమ్మత్తులు చేయిస్తామని హామీ ఇచ్చారు.అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేయాలని కాంట్రాక్టర్ను ఎమ్మెల్యే ఆదేశించారు. దీంతోపాటు కొత్తూరు మున్సిపాలిటీలో క్రీడా ప్రాంగణం లేదని యువకులు తమకు వినతిపత్రం ఇచ్చారని త్వరలోనే క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బాలాజీ,ఏఈ నరేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు హరినాథ్ రెడ్డి,నాయకులు వీరమొని దేవేందర్,కరోల్ల సురేందర్, కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు శివశంకర్ గౌడ్,ఎమ్మెస్ సత్తయ్య,మాజీ సర్పంచులు జగన్,ఏనుగు జనార్దన్ రెడ్డి,దేవేందర్ గౌడ్,మాజీ ఎంపీటీసీలు కుమారస్వామి గౌడ్,కోమ్ము కృష్ణ,తుప్పర బాలరాజ్,పాశం కృష్ణ,నరసింహ,జగన్, హస్సన్,యువకులు,మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    సంస్కార్ స్కూల్ డే-పోసిటివ్ పేరెంటింగ్ సెమినార్ విజయవంతం

    సంస్కార్ స్కూల్ డే-పోసిటివ్ పేరెంటింగ్ సెమినార్ విజయవంతం మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 15 :- భైంసా పట్టణంలోని బృందావన్ గార్డెన్స్‌లో సంస్కార్ స్కూల్ డే మరియు పోసిటివ్ పేరెంటింగ్ సెమినార్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముదోల్ ఎమ్మెల్యే పవార్…

    షాపూర్ క్షత్రియ పట్టుకరి సమాజ్ ఆధ్వర్యంలో ముంజు బంధంన్

    షాపూర్ క్షత్రియ పట్టుకరి సమాజ్ ఆధ్వర్యంలో ముంజు బంధంన్ మనోరంజని ప్రతినిధి ఆర్ముర్ మార్చి 15 ఏస్ ఎస్ కే క్షత్రియ సమాజ్ (పట్కరి) షాపూర్ నగర్ లో పిల్లలకు ఉపనయనం (ముంజు బంధంన్) కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీనికి షాపూర్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, LED, LCD టెలివిజన్ల ధరలు తగ్గే అవకాశం

    ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, LED, LCD టెలివిజన్ల ధరలు తగ్గే అవకాశం

    ఆ పథకానికి వయోపరిమితి 60 ఏళ్లకు తగ్గింపు!

    ఆ పథకానికి వయోపరిమితి 60 ఏళ్లకు తగ్గింపు!

    శ్రీశైలం దేవస్థానం పేరుతో నకిలీ వెబ్‌సైట్.. మోసపోయిన భక్తులు

    శ్రీశైలం దేవస్థానం పేరుతో నకిలీ వెబ్‌సైట్.. మోసపోయిన భక్తులు

    సంస్కార్ స్కూల్ డే-పోసిటివ్ పేరెంటింగ్ సెమినార్ విజయవంతం

    సంస్కార్ స్కూల్ డే-పోసిటివ్ పేరెంటింగ్ సెమినార్ విజయవంతం