

ప్రజావాణి’ దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలి: కరీంనగర్ కలెక్టర్
మనోరంజని ప్రతినిధి కరీంనగర్ మార్చి 11 -కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి నిర్వహించారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులతో కలిసి సోమవారం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేసే దరఖాస్తులను నిర్లక్ష్యం చేయకుండా సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. కొన్ని దరఖాస్తులను అక్కడికక్కడే పరిష్కరించారు. ప్రజావాణికి మొత్తం 226 దరఖాస్తులు వచ్చాయి