

ప్రజలంతా బిజెపి వైపు ఉన్నారు
రానున్నది రామ రాజ్యమే
ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్-
మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 05 :– రాష్ట్రంలో ప్రజలంతా బిజెపి వైపు ఉన్నారని, ఇక రాష్ట్రంలో రానున్నది రామరాజ్యమేనని *ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పాలనను ప్రజలు వ్యతిరేకిస్తున్నారనడానికి నిదర్శనం ఎమ్మెల్సీ ఎన్నికలేనన్నారు. ఉపాధ్యాయ, పట్టభధ్రుల ఎన్నికల్లో రెండు స్థానాలు బిజెపి కైవసం చేసుకోవడం శుభసూచకమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలనకు ప్రజలు బ్రహ్మ రథం పడుతున్నారన్నారు..ఇక రాష్టం లో రానున్నది రామరాజ్యమని వచ్చే ఎన్నికల్లో రాష్టం లో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు ఖాయమన్నారు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి కి ఓటు వేసిన పట్టభద్రులకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం ముధోల్ నియోజకవర్గంభారీ మెజార్టీ రావడం తో ప్రజలంతా కాషాయం వైపే ఉన్నారనడానికి నిదర్శనం అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కష్టపడి పని చేసిన కార్యకర్తలకు, నాయకులకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.