

పోసాని కృష్ణమురళీకి గుడ్ న్యూస్ చెప్పిన నరసరావుపేట కోర్టు..
పల్నాడు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‍పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసుల్లో సినీ నటుడు పోసాని కృష్ణమురళీకి స్వల్ప ఊరట లభించింది. పల్నాడు జిల్లా నరసరావుపేట రెండో పట్టణ పోలీస్ స్టేషన్‍లో నమోదైన కేసులో పోసానికి బెయిల్ మంజూరు అయ్యింది. పోసానికి బెయిల్ మంజూరు చేస్తూ నరసరావుపేట జూనియర్ సివిల్ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. రూ.10 వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని న్యాయమూర్తి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.