

-పంటలు ఎండిపోయిన పట్టించుకోరా
-తక్షణమే నారాయణ పూర్ చెరువులో వెంటనే నీళ్లను నింపాలి
-ఎండిపోయిన పంటలకు నష్ట పరిహారం ఎకరాకు ఇరవై వేల చొప్పున అందించాలి
-ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు, ఉత్తే ముచ్చేటనా
-హామీలు అడిగితే అసహనం తో రైతులను దాబాయించుతరా
-నలభై ఎనిమిది గంటల్లో నీళ్లు విడుదల చేయకుంటే రైతుల పక్షాన పోరాటం చేస్తాం
-చొప్పదండి మాజీ శాసన సభ్యులు సుంకె రవిశంకర్
మనోరంజని ప్రతినిధి గంగాధర, మార్చి 10 : – గంగాధర మండలం గర్శకుర్తి గ్రామంలో ఎండిపోయిన పంటలను ఆయన పరిశీలించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కళ్ళముందే పంట పొలాలు ఎండిపోతుండడంతో ఆందోళన చెందుతున్న రైతులు బాధ వర్ణనాతీతం అని అన్నారు.అరకోరగా వస్తున్న గోదావరి జలాలు-ఖాళీ అయిన చెరువులు కుంటలు పడిపోయిన భూగర్భ జలమట్టం తక్షణమే గోదావరి జలాలతో పంట పొలాలను కాపాడాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు.రైతాంగం ఆరుగాలం కష్టించి వరి నాట్లు వేసి సుమారు రెండు మూడు నెలలు అర కొర నీటితో పంట పొలాలను కాపాడి తీరా వరి చేలు కళ్ళముందే పొట్టదశలో,కంకి దశలో ఎండిపోతుంటే రైతుల కళ్ళల్లోంచి నీళ్లు వస్తున్నాయని అన్నారు.గత సంవత్సరంన్నర క్రితం వరకు నిరాఘాటంగా వచ్చిన గోదావరి జల్లాలు నేడు అరకొరగా వస్తుండడంతో గ్రామాల్లోని చెరువులు కుంటలు ఎండి పోయాయని,చెరువులు కుంట లలో నీటి మట్టం తగ్గిపోవడంతో బావులు బోర్లు ఎండిపోయాయిని,
కాలువల వెంట నాట్లు వేసిన రైతులు కాలువల్లో నీరు రాకపోతుందా అనే ఆశతో ఎదురుచూసి చూసి తీరా పది రోజులకు ఒకసారి కంటి తుడుపుగా వస్తున్న గోదావరి జల్లాలు పొలాలు తడవకముందే ఆగిపోతుండడంతో రైతుల ఆశలు అడియాశలవుతున్నాయని,అన్నారు.వందలాది ఎకరాల వరిపంట ఎండిపోయిన పట్టించు కోరా అని ఎమ్మెల్యే సత్యంను ఇక్కడి రైతులు ప్రశ్నిస్తే, అసహనంతో దాబాయించండం ఏంటని ప్రశ్నించారు. చుక్క నీరు రాక,పంటలు ఎండిపోయి లక్షలాది రూపాయలు నష్టపోతున్న రైతులకు నష్ట పరిహారం క్రింద ఎకరాకు ఇరవై వేల చొప్పున అందించాలని అన్నారు.తెలంగాణా రాకముందుచొప్పదండి నియోజకవర్గ ప్రాంతం కరువు కాటకాలతో అల్లాడిందని,కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక,కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాక
గోదావరి జలాల రాకతో గత ఆరు, ఏడు సంవత్సరాలు బీడు భూములన్నీ పంటపొలాలుగా మారిన తరుణంలో తమకు ఏ విధమైన కష్టాలు ఉండవని తలచిన రైతులకు ఒక్కసారిగా గోదావరి జల్లాల రాక అరకొరగా మారడంతో తిరిగి కరువు కోరల్లో చొప్పదండి నియోజకవర్గం అల్లాడుతుందని అన్నారు.మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్ది నారాయణా పూర్ కు వచ్చిన సందర్బంగా అనేక హామీలు గుప్పించారని అయన గుర్తు చేసారు.ఒకపక్క రుణమాఫీ కాక మరొక రైతు భరోసా రాక కొంతమంది రైతులు ఆందోళన చెందుతున్న సమయంలో తీరా నాట్లు పెట్టిన పొలాలు కూడ ఎండిపోతుండడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఏది ఏమైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతుల గోడు పట్టించుకోవాలని నలభై ఎనిమిది గంటల్లో గోదావరి జలాలను తక్షణమే విడుదల చేయాలని, లేని పక్షంలో రైతుల పక్షాన మహాధర్నా చేస్తామని ఈ సందర్బంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు