

నేడు ములుగు జిల్లాకు రానున్న గవర్నర్
మనోరంజని ప్రతినిధి ములుగు మార్చి 11 – తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మంగళవారం ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. కొండపర్తి గ్రామాన్ని గవర్నర్ ఇటీవల దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాడ్వాయి మండలంలోని కొండపర్తి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం మేడారం వెళ్లి సమ్మక్క-సారలమ్మలను దర్శనం చేసుకోనున్నారు