నాగర్ కర్నూల్‌లో చెత్త బండ్ల సమస్య – షెడ్‌కే పరిమితం

నాగర్ కర్నూల్‌లో చెత్త బండ్ల సమస్య – షెడ్‌కే పరిమితం

మున్సిపాలిటీకి చెందిన మూడు చెత్త బండ్లు మూడు నెలలుగా పనిచేయకుండా నిలిపివేత
షెడ్ యజమాని వివరణ – మున్సిపాలిటీ రిపేర్ చేయించని కారణంగా నిల్వ
ప్రజల డిమాండ్ – మున్సిపల్ కమిషనర్ తక్షణ చర్యలు తీసుకోవాలి

మనోరంజని ప్రతినిధి నాగర్ కర్నూల్ మార్చి 01 :- నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలో మురుగు, చెత్త తొలగింపునకు ఉపయోగించే మూడు చెత్త బండ్లు గత మూడు నెలలుగా షెడ్‌లో నిరుపయోగంగా నిలిచిపోయాయి. స్థానిక మున్సిపల్ సిబ్బంది వాటిని మరమ్మతులకు పంపినప్పటికీ, ఇప్పటివరకు రిపేర్ చేయించకుండా అలాగే వదిలేశారని సమాచారం. షెడ్ యజమాని వివరాలు అందిస్తూ, “మున్సిపాలిటీ ఈ బండ్లను రిపేర్‌ చేయించాల్సిందిగా మాకు అప్పగించారు. అయితే, మేజర్ ఖర్చు అవుతుందని మేము తెలియజేసినప్పటికీ, ఇప్పటి వరకు ఎవరూ ఈ సమస్యపై స్పందించలేదు” అని చెప్పారు. ఈ బండ్లను మున్సిపాలిటీ తరఫున కొందరికి అప్పగించినప్పటికీ, ఇప్పటివరకు ఆ సమస్య పరిష్కారమవ్వలేదు. ఇదే పరిస్థితి కొనసాగితే, చెత్త నిర్వహణ వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టణ ప్రజలు మున్సిపల్ కమిషనర్ ఈ సమస్యను సత్వర పరిష్కారం చేయాలని, చెత్త బండ్లను మళ్లీ సేవలోకి తీసుకురావాలని కోరుతున్నారు

  • Related Posts

    బీసీ రిజర్వేషన్లు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం హర్షనియం.

    బీసీ రిజర్వేషన్లు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం హర్షనియం.-జిల్లా బీసీ సంక్షేమ సంఘము.అధ్యక్షుడు ఎంబడి.చంద్రశేఖర్. మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 18 :-నిర్మల్ జిల్లా: – బీసీ ప్రజాలు విద్య.ఉద్యోగ.రాజకీయ,ఆర్థిక,సామాజికంగా అభివృద్ధి చెందే విధంగా 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లుకు తెలంగాణా…

    నియోజకవర్గంలో భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయిదెబ్బతిన్న వంద చెరువుల మరమ్మత్తులకు నిధులు ఇవ్వండి

    నియోజకవర్గంలో భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయిదెబ్బతిన్న వంద చెరువుల మరమ్మత్తులకు నిధులు ఇవ్వండిచెప్పులరిగే దాకా తిరుగుతున్న సమస్యలు పరిష్కారం కావడం లేదునియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 18 :-ముధోల్ నియోజక వర్గంలో గతంలో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    హైదరాబాద్లో బంగారం ధర ఫస్ట్ టైం ఎంతకు పోయిందంటే..!!

    హైదరాబాద్లో బంగారం ధర ఫస్ట్ టైం ఎంతకు పోయిందంటే..!!

    బీసీ రిజర్వేషన్లు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం హర్షనియం.

    బీసీ రిజర్వేషన్లు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం హర్షనియం.

    నియోజకవర్గంలో భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయిదెబ్బతిన్న వంద చెరువుల మరమ్మత్తులకు నిధులు ఇవ్వండి

    నియోజకవర్గంలో భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయిదెబ్బతిన్న వంద చెరువుల మరమ్మత్తులకు నిధులు ఇవ్వండి

    రూ.ఐదు లక్షల గంజాయి పట్టివేత.

    రూ.ఐదు లక్షల గంజాయి పట్టివేత.