నవమాసాలు మోసి అల్లారు ముద్దుగా పెంచుకున్న కన్న కొడుకే ఆ తల్లికి శాపంగా మారాడు

నవమాసాలు మోసి అల్లారు ముద్దుగా పెంచుకున్న కన్న కొడుకే ఆ తల్లికి శాపంగా మారాడు. ఏ తల్లి అయినా ఇలాంటి కొడుకునా కని పెంచింది అనుకునేలా విచక్షణ మరిచి తల్లిని పొట్టనపెట్టుకున్నాడు. మద్యానికి బానిసై తరచూ గొడవ పడుతూ కుటుంబానికి భారం అయినా.. అన్నీ భరిస్తూ పోషిస్తూ వస్తున్న తల్లిని కిరాతకంగా పొడిచి చంపడం సంగారెడ్డి జిల్లాలో కలకలం రేపింది. ‌

సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధి డివినో విల్లాస్ లో జరిగింది ఈ దారుణ ఘటన తాగుడుకు బానిస అయిన నవారు కార్తీక్ రెడ్డి (26) తల్లి రాధిక (52) పై కత్తితో దాడి చేశాడు. ఆస్తి తనపేరున రాయాలని, అడిగినంత డబ్బు ఇవ్వాలని తాగుడు మత్తులో కన్న తల్లి అని మరిచి చంపేశాడు.
కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన రాధికను కుటుంబ సభ్యులు హుటాహుటిన సిటిజన్ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా రక్త స్రావం జరగడంతో చికిత్స పొందుతూ రాధిక మృతి చెందారు.

మద్యానికి బానిసై ఆస్తికోసం కుటుంబ సభ్యులతో తరచూ గొడవపడుతూ ఉండేవాడని, సోమవారం (మార్చి3) ఉదయం ఈ..దారుణానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

  • Related Posts

    హీరో బాల‌కృష్ణ ఇంటి ఫెన్సింగ్‌ను ఢీకొట్టిన కారు

    హీరో బాల‌కృష్ణ ఇంటి ఫెన్సింగ్‌ను ఢీకొట్టిన కారు టాలీవుడ్ సీనియ‌ర్‌ నటుడు నందమూరి బాలకృష్ణ ఇంటి ముందు శుక్రవారం తెల్లవారుజామున ఓ కారు బీభత్సం సృష్టించింది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబర్‌-1లో వేగంగా వచ్చిన ఓ కారు బాలయ్య ఇంటి ముందున్న…

    కరెంటు హై టెన్షన్ వైరు పట్టుకొని ఆత్మహత్య

    45 లక్షల ప్యాకేజితో ఉద్యోగం..అంతా సాఫి గా అనుకునే సమయంలో…కాచిగూడ టూ గిద్దలూరు …వెళ్ళాడు…అక్కడ గూడ్స్ పైకి ఎక్కి… కరెంటు హై టెన్షన్ వైరు పట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు… కారణం ఏంటో అనే కోణం లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు! మనోరంజని…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    2028 కల్లా మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

    2028 కల్లా మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

    మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న నారా లోకేష్ దంపతులు

    మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న  నారా లోకేష్ దంపతులు

    రేపటి నుండి ఒంటిపూట బడులు

    రేపటి నుండి ఒంటిపూట బడులు

    హీరో బాల‌కృష్ణ ఇంటి ఫెన్సింగ్‌ను ఢీకొట్టిన కారు

    హీరో బాల‌కృష్ణ ఇంటి ఫెన్సింగ్‌ను ఢీకొట్టిన కారు