

నల్లమల చెంచు కుటుంబాల రక్షణకు చర్యలు చేపట్టాలి
ఐ టి డి ఎ కు వెంటనే రెగ్యులర్ ప్రాజెక్టు అధికారిని నియమించాలి
చెంచు పెంటలకు అందుబాటులో అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయాలి
ఆదివాసి సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కోవ దౌలత్ రావు మొకాశి డిమాండ్
//ఆదిలాబాద్// 07-03-2025:
నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో గల చెంచు పెంటలలో నివసిస్తున్న చెంచు ఆదివాసి కుటుంబాలకు సరియైన పౌష్టిక ఆహారాన్ని, ఐరన్ మాత్రలు, గర్భిణీ స్త్రీలకు, పసిపిల్లలకు టీకాలను సమయానుసారంగా అందించుటకు తగిన అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసి అవి సక్రమంగా వారికి అందించే విధంగా చూడాలని మరియు అంగన్వాడీ కేంద్రాలలో ఆయాలను, అంగన్వాడీ టీచర్లను నియమించాలని, అదేవిధంగా సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థకు వెంటనే రెగ్యులర్ ప్రాజెక్టు అధికారిని నియమించి ఆల్కహాలిక్ లివర్ సిర్రోసిస్, ఎనీమియా వంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా తగు చర్యలు చేపడుతూ వారి ఆరోగ్యం పట్ల వారు శ్రద్ధ కనబరచేవిధంగా వారికి అధికారులు అవగాహన కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోరినారు. అదేవిధంగా ఉపాధి హామీ చట్టం కింద వారికి పని కల్పించి ఆదాయ మార్గాలు చూపుతూ వారి మరణాలు అరికట్టుటకు తగు రక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు