

దొంగిలించిన బంగారు ఆభరణాలతో పట్టుబడిన నిందితున్ని అరెస్టు చేసిన పోలీసులు
నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ మండలం, మార్చ్05 మనోరంజని ప్రతినిధి, ఆర్మూర్ నియోజవర్గం పరిధిలోని,
దేగాం మరియు మిర్దాపల్లి గ్రామాలలో అర్దరాత్రి పూట తాళం వేసి ఉన్న ఇండ్లలో జరిగిన దొంగతనం కేసులలో నిందితుడు అలకుంట శ్రీనివాస్, ఈ రోజు మార్చ్ 05 నా ఆర్మూర్ లోని పాత బస్ స్టాండ్ దగ్గర పట్టుకుని, అతని వద్ద నుండి దొంగతనం చేసిన బంగారు మరియు వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకుని అతన్ని జైలుకు పంపడం జరిగినది, అని ఆర్మూర్ సీఐ సత్యనారాయణ తెలిపారు.